మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మాచర్ల నూర్ భాషా సంక్షేమ సంఘం సభ్యులు, పెద్దలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదినాలను జరుపుకోవాలని అల్లాను ప్రార్థించారు. నూర్ భాషా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆయన ప్రజాసేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
Author: myapnews9@gmail.com
మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన, ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బృంగా బ్రదర్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామ శివారులోని అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ నివాసితులకు భోజనం అందించి, వారితో కలిసి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బృంగా లింగయ్య, దుర్గి యార్డ్ చైర్మన్ లింగ బ్రహ్మయ్య, జానకిరామయ్య, మేకల దాసు, గాలి శ్రీను, కేళం ఆదినారాయణ, మాగులూరి నారయ్య, బృంగా రమణరావు, షేక్ సిలార్, ముత్తినేని పుల్లయ్య, కేళం రవి, బృంగా నరసింహరాజు, బృంగా నాగరాజు, పెరువల ఏసోబు, మాచర్ల మదర్, మంద కోటయ్య, మంద నాగేశ్వరావు, కేళం నారాయణ, భేరి నరసింహారావు, చిత్తులూరి రామారావు, బుసాని రాజయ్య, తిక్క పాపయ్య, మోసిన్, ముజఫర్, మైన, నాగూర్, జిలానీ, బృంగా వర్మ తదితరులు…
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ మోసిన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.రాయవరం జంక్షన్ వద్ద ఉన్న మదరసా పిల్లలకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే లింగాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పఠాన్ బద్రుద్దీన్, ముటుకూరు సుభాని, చింతపల్లి ముజఫర్, బట్టల మౌలాలి, టీ షరీఫ్, టోపీ సుభాని, అలీ, మార్బుల్ ఖలీల్, అబ్బాస్ షరీఫ్, ఖాసీం, స్టూడియో మస్తాన్, షన్వాజ్, రియాజ్, బుల్లెద్దుల శివ, స్టూడియో మస్తాన్ సందీప్, బ్రహ్మం ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరు గాంచిన, ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి జన్మదినం సందర్భంగా శనివారం మాచర్ల పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా లెపర్స్ కాలనీ నందు అన్నదానం కార్యక్రమం నిర్వహించడంతో పాటు కేక్ కటింగ్ చేసి, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎక్స్ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాచర్ల బాబు, గెల్లిపోగు మరియాదాసు, చింతమళ్ళ అడవిరాముడు, భీమవరపు శ్రీను, దొడ్డా చందు, నార్ల రాములు, డేగల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా కంభంపాడు గ్రామంలో భూముల రీ-సర్వే కార్యక్రమంపై గ్రామ సభ మరియు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ , మండల సర్వేయర్, స్పెషల్ ఆఫీసర్ & MPDO, గ్రామ సర్వేయర్లు, VRO, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు. భూముల రీ-సర్వే ప్రక్రియ, దాని ప్రయోజనాలు, భూమి హక్కుల స్పష్టత, రికార్డుల సరిదిద్దడం వంటి అంశాలపై అధికారుల ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.గ్రామంలో భూముల వివాదాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ రీ-సర్వే కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
పల్నాడు జిల్లా, నూజండ్ల:పల్నాడు జిల్లాలోని నూజండ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో శుక్రవారం అపూర్వ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల బాత్రూమ్‌లో భారీ కొండచిలువ కనిపించడంతో విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.వివరాల్లోకి వెళితే… ఒక విద్యార్థి టాయిలెట్‌కు వెళ్లేందుకు బాత్రూమ్ తలుపు తెరిచిన వెంటనే లోపల పెద్ద కొండచిలువను గమనించాడు. దీంతో అతను భయంతో కేకలు వేయగా, ఇతర విద్యార్థులు కూడా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.ఈ ఘటనతో కొంతసేపు పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, పాము పట్టుబడిన తర్వాత విద్యార్థులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.అయితే, పాఠశాల పరిసరాల్లో అడవి జంతువులు ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు.
పల్నాడు జిల్లా, కారంపూడి మండలం:పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసే దిశగా పోలీసులు చర్యలు మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో కారంపూడి మండలం పేట సన్నిగండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని పోతురాజు గుట్ట ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ తనిఖీలలో గురజాల డీఎస్పీ ఎం. మహేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐలు శరత్ బాబు, రాజేష్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలు, వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. అలాగే 14 ఆయుధాలను (వెపన్స్) గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల ఈ చర్యతో పోతురాజు గుట్ట పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలపై గట్టి చెక్ పడినట్లు…
రాష్ట్రంలో జరగబోయే పాలిసెట్ (POLYCET), ఏపీఆర్జేసీ (APRJC) ప్రవేశ పరీక్షల తేదీలలో మార్పు చేయాలని తల్లిదండ్రులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కోరారు.ఈ నెల 24న రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (APRJC) ప్రవేశ పరీక్ష, 25న పాలిటెక్నిక్ (POLYCET) పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.అయితే వరుసగా రెండు రోజులు పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల తేదీలలో మార్పు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పోలేపల్లి గ్రామానికి చెందిన బాలబోయిన శంకర్ (50) స్నేహితుడి పొలంలో బోరు మోటార్‌ను సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. షాక్ తగిలిన అనంతరం వైర్లు పడిపోవడంతో మృతదేహం తీవ్రంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చక్రధర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల వీడ్కోలు సభను పురస్కరించుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) ఆధ్వర్యంలో పీజీ అడ్మిషన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ (OSD, ఏఎన్యూ) మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు యూనివర్సిటీలో చదివే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారతదేశంలోని టాప్ 100 యూనివర్సిటీలలో, ప్రపంచ టాప్ 500లో ఏఎన్యూ స్థానం సాధించిందని ఆయన తెలిపారు. పీజీ కోర్సులలో అడ్మిషన్స్‌కు ఏఎన్యూ పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రొఫెసర్ వి. దివ్య తేజ మూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా పీజీ అడ్మిషన్స్‌కు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలను విడుదల చేసి, విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియపై సమగ్ర వివరాలు అందించారు. సినీ నిర్మాత, హీరో డాక్టర్ శశికుమార్ మాట్లాడుతూ, అవకాశాలు ఎవరు ఇవ్వరు, మనమే సాధించుకోవాలని, ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో…
