చలివేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రతిరోజూ వందలాది మంది దాహాన్ని తీర్చుకునే అవకాశం లభిస్తుందని, ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన రవితేజ హాస్పిటల్స్ యాజమాన్యానికి, టీడీపీ యువ నాయకుడు షేక్ మోసిన్‌కు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Author: myapnews9@gmail.com
ఇనుమెళ్లలో పురాతన దేవాలయంలో 7 విగ్రహాలు వెలికితీతపల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో సంచలన ఘటన వెలుగుచూసింది. పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలో ఏడు విగ్రహాలు బయటపడటం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.ఆలయ పునర్నిర్మాణ పనుల భాగంగా మంగళవారం రాత్రి విగ్రహాలను తొలగించే సమయంలో దేవాలయం లోపల ఒక బావి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం రాళ్లను తొలగించగా, బావిలో నుంచి ఏడు లోహ విగ్రహాలు బయటపడ్డాయి.ఈ ప్రక్రియను దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల సమక్షంలో నిర్వహించారు. వెలికితీసిన విగ్రహాలు విలువైన పంచలోహ విగ్రహాలు అయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్వ కాలంలో దొంగల బెడద నుంచి రక్షణ కోసం ఈ బావిలో విగ్రహాలను దాచినట్లు స్థానికులు చెబుతున్నారు. అదనంగా, ఆలయంలో మరోచోట మూడు రేకులు కూడా గుర్తించినట్లు సమాచారం.ఇనుమెళ్ల గ్రామం స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్వగ్రామం కావడం గమనార్హం. దేవాలయంలో లభించిన విగ్రహాలను…
మాచర్ల పట్టణంలోని 8వ వార్డులో ఈ రోజు సుడిగాలి పర్యటన నిర్వహించి, స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నాను. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను నేరుగా అడిగి వివరాలు సేకరించాను.అలాగే, వార్డులో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఆరు ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12.2 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో దేవాలయాల పునర్నిర్మాణం, మండపాల నిర్మాణం, ప్రాంగణాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన చేపట్టనున్నారు.ఈ అభివృద్ధి పనులు పూర్తయ్యాక భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం, విశ్రాంతి వసతులు లభిస్తాయని అధికారులు తెలిపారు.నిధులు మంజూరైన దేవాలయాలు:
తహసీల్దార్ కార్యాలయంలో జనగణనకు సిద్ధం… ఎన్యుమరేటర్లకు కిట్లు అందజేతమాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో జనగణన కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లకు అవసరమైన కిట్లను అందజేశారు.జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పత్రాలు, ఫారాలు, ఐడీ కార్డులు, ఇతర సామగ్రి కలిగిన ఎన్యుమరేటర్స్ కిట్లను అధికారికంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఇంటిని సందర్శించి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు.జనాభా గణాంకాలు ప్రభుత్వ ప్రణాళికలకు ఎంతో కీలకమని, అందువల్ల బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆయన తెలిపారు. అలాగే ప్రజలు కూడా సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాచర్ల పట్టణంలో C-WAGE ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 2.00 సెంట్ల భూమి అవసరమవడంతో, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు అభ్యర్థన మేరకు తహశీల్దారు కిరణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు.ఈ పరిశీలనలో సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. చంద్రవంక సమీపంలో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.ఈ C-WAGE ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి, కలుషిత నీరు నదుల్లో కలవకుండా నిరోధించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ చర్యలు తీసుకుంటోంది.
పశ్చిమ బెంగాల్లో నెలకు రూ.2,500 సంపాదించే ఓ పనిమనిషి ఎమ్మెల్యే అయ్యారు. కలితా మారీ (37)అనే మహిళ ఆస్ట్రమ్ (SC) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి TMC అభ్యర్థిపై 12వేల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 1,07,692 ఓట్లు సాధించారు. కలిత గత రెండు దశాబ్దాలుగా 3-4 ఇళ్లలో పాత్రలు కడగడం, వంట పనులు లాంటివి చేస్తున్నారు. MLA అభ్యర్థిగా ప్రకటించినా ఆ పనులు చేసుకుంటూనే ప్రచారం చేసి గెలుపొందడం విశేషం.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆజాద్ నగర్ కాలనీ, 28వ వార్డుకు చెందిన మహమ్మద్ రఫీ గత కొంతకాలంగా రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మానసికంగా దిగులుకు గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రఫీ మాచర్ల రైల్వే ట్రాక్ సమీపంలోని హైవే కొత్త బ్రిడ్జిపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తన కుమారుడు యూసఫ్‌కు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న కుమారుడు వెంటనే అక్కడికి చేరుకోగా, బ్రిడ్జిపై ఆటోను ఉంచి కిందకు దూకి ఉన్నట్లు గుర్తించాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (గర్ల్స్), కారంపూడిలో 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థినుల ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జి. సరస్వతి తెలిపారు.ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె వివరాలు వెల్లడిస్తూ,3వ తరగతిలో 40 సీట్లు,4వ తరగతిలో 40 సీట్లు,5వ తరగతిలో 40 సీట్లు,6వ తరగతిలో 21 సీట్లు,7వ తరగతిలో 23 సీట్లు,8వ తరగతిలో 4 సీట్లు,9వ తరగతిలో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న సీట్లను విద్యార్థినుల ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.అభ్యర్థులు మే 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపల్ సూచించారు.
ముఖ్యంగా బంగారు షాపులకు ఆర్డర్లపై ఆభరణాలు సరఫరా చేసే వ్యక్తులను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 566 గ్రాముల బంగారం దోచుకున్నట్లు చెప్పారు.ఈ కేసులో ఆరుగురు నిందితులను ప్రత్యేక బృందాలు పేట సన్నిగళ్ల గ్రామం సమీపంలోని ఎన్‌ఎస్‌పీ కాలవ కట్ట వద్ద అరెస్టు చేశాయి. నిందితుల వద్ద నుంచి రెండు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను ప్రత్యేక బృందాలు పేట సన్నిగళ్ల గ్రామం సమీపంలోని ఎన్‌ఎస్‌పీ కాలవ కట్ట వద్ద అరెస్టు చేశాయి. నిందితుల వద్ద నుంచి రెండు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.దోచుకున్న బంగారం మొత్తాన్ని పోలీసులు పూర్తిగా రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.పోలీసుల అప్రమత్తతతో గ్యాంగ్ అరెస్ట్ కావడంతో స్థానిక ప్రజలు ఉపశమనం వ్యక్తం చేస్తున్నారు.
