
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (గర్ల్స్), కారంపూడిలో 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థినుల ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జి. సరస్వతి తెలిపారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె వివరాలు వెల్లడిస్తూ,
3వ తరగతిలో 40 సీట్లు,
4వ తరగతిలో 40 సీట్లు,
5వ తరగతిలో 40 సీట్లు,
6వ తరగతిలో 21 సీట్లు,
7వ తరగతిలో 23 సీట్లు,
8వ తరగతిలో 4 సీట్లు,
9వ తరగతిలో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న సీట్లను విద్యార్థినుల ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు మే 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపల్ సూచించారు.
