ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్, రాజకీయ భీష్ముడు కొణిజేటి రోశయ్య 93వ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాచర్లలోని రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 4న రెండు తెలుగు రాష్ట్రాల్లో రోశయ్య జయంతిని ఎంతో గౌరవప్రదంగా నిర్వహించడం ఆనవాయితీగా మారిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దశాబ్దాల పాటు సమర్థంగా నడిపించిన అపూర్వ ఆర్థికవేత్తగా, రికార్డు స్థాయిలో 15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కిందన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో కొణిజేటి రోశయ్య పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడిందని పేర్కొన్నారు. వివాదరహిత రాజకీయ నాయకుడిగా, సమయస్ఫూర్తి కలిగిన పరిపాలకుడిగా, క్లిష్ట ఆర్థిక పరిస్థితులను సమర్థంగా…
Author: myapnews9@gmail.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్లలో మెగా జాబ్ డ్రైవ్ ఘనంగా నిర్వహించారు. మాచర్లలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల వేదికగా నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 20 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 187 మంది నిరుద్యోగ యువత హాజరుకాగా, వారిలో 68 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.ఈ విషయాన్ని పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ. తమ్మాజి రావు వెల్లడించారు. ముఖ్య అతిథిగా గౌతంరెడ్డికార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాచర్లలో ఇలాంటి మెగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం వచ్చిన వారు జీతం తక్కువ అని వెనక్కి తగ్గకుండా, జీవితం కోసం కష్టపడి పనిచేయాలని యువతకు సూచించారు. ఒక కంపెనీలో అనుభవం, నైపుణ్యాన్ని పెంపొందించుకుని మరింత ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు తెలియజేస్తూ,…
పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం.. పాలువాయి PACSలో మొక్కల నాటం ప్రారంభం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పాలువాయి PACS ప్రాంగణంలో సొసైటీ చైర్మన్ అల్లం నాగలక్ష్మి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాచర్ల బ్రాంచ్ GDCC Bank మేనేజర్ కరుణాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
“నిండు జీవితానికి 2 చుక్కలు” అనే నినాదంతో మాచర్ల టౌన్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, టీడీపీ సీనియర్ నాయకులు మద్దిగపు వెంకట్రామిరెడ్డి, యూనిట్ ఇన్‌చార్జి శివశంకర్ నాయక్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, వారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నాయకులు సూచించారు.
మాచర్ల: మొహరం పండుగతో పాటు నెలాఖరు చివరి ఆదివారం నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులకు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు అసిస్టెంట్ అకౌంట్ అధికారి జి. చంద్రశేఖర్ తెలిపారు.మాచర్ల, గురజాల విద్యుత్ కార్యాలయాల్లో బిల్లు చెల్లింపు కౌంటర్లు సాధారణంగా పనిచేయనున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బిల్లు వసూళ్ల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాత, కొత్త బకాయిలను సకాలంలో చెల్లించాలని, తద్వారా విద్యుత్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు.
యువతకు ఉపాధి అవకాశాల వేదిక – ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎస్‌వీఆర్ డిగ్రీ కళాశాల, కృష్ణవేణి జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ (మంగళవారం) ఉదయం 9 గంటలకు మాచర్లలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాబ్ మేళా పోస్టర్‌ను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. టీమ్ కంప్యూటర్స్, మెడ్‌ప్లస్, హీరో మోటార్ వర్క్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్, అపోలో టైర్స్, యమహా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెటిరో డ్రగ్స్ తదితర సంస్థలు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి.…
మాచర్ల: 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల టౌన్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర-2026 కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని అన్నారు. నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొంటూ యువత, మహిళలు, వృద్ధులు అందరూ యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవం: మాచర్లలో భారీ ర్యాలీ, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం మాచర్ల,: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ మరియు బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేశారు. కార్యక్రమానికి ముందు రింగ్ రోడ్ సెంటర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు.ర్యాలీలో నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు, కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు భారీ గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ప్రజలు కూడా రహదారుల వెంట నిలబడి ర్యాలీకి అభినందనలు తెలిపారు.…
నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ, పలనాడు జూనియర్ కళాశాలలు విశేష ఫలితాలు సాధించి మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి.జూనియర్ ఇంటర్ MPC విభాగంషేక్ రోషిని – 464 మార్కులు (పట్టణంలో ప్రథమ స్థానం)బి. శ్రీహిత, పి. మధు గణేష్ – 463 మార్కులు (ద్వితీయ స్థానం)పి. నాని – 462 మార్కులు (తృతీయ స్థానం)బి. ఛత్రపతి నాయక్ – 461బి. వైష్ణో – 460ఈ. తన్మయి – 459ఎస్.ఎన్. అంజనీ కుమార్, కె.జి. శశిభూషణ్ – 458షేక్ జబీన్, ఏ. చంద్ర మహేష్ – 457సి. రామాంజనేయులు – 455షేక్ ఇర్ఫాన్ – 454సి. శ్రీచరణ్ – 452టి. చరణ్ తేజ – 450 మార్కులుజూనియర్ ఇంటర్ BiPC విభాగంబి. సునీత – 439/455 మార్కులు (పట్టణంలో ప్రథమ స్థానం)ఎం. చరిత – 434 మార్కులు (ద్వితీయ స్థానం)చె. హారిక, పి. ప్రత్యూష – 434 మార్కులు…
