యూపీలోని కౌశాంబీ జిల్లాలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. మేకలు, గొర్రెలను తరలిస్తున్న ఓ ట్రక్కు ప్రమాదానికి గురికాగా.. స్థానికులు సహాయం చేయాల్సింది పోయి గొర్రెలను ఎత్తుకెళ్లడంలో మునిగిపోయారు.ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడినా ఎవరూ పట్టించుకోలేదు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఒకరి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికుల నిర్లక్ష్య వైఖరిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Author: myapnews9@gmail.com
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువకు నీటి విడుదల* నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు సోమవారం అధికారులు తాగునీటిని విడుదల చేశారు. మొత్తం 10 టీఎంసీల నీటిని 15 రోజుల పాటు కుడి కాలువకు విడుదల చేయనున్నారు. ఈ నీటితో కుడి కాలువ పరిధిలోని చెరువులను నింపి తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నారు.
మాచర్ల పట్టణానికి చెందిన బీసీ సెల్ అధ్యక్షుడు మున్నా రాంబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారనే విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి తీవ్రస్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య వ్యాఖ్యలు:👉 “నీ రక్తదాహం ఇంకా తీరలేదా రాక్షస రామకృష్ణారెడ్డి..!?” అంటూ మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు.👉 బలహీన వర్గాలపై దాడులు చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు.👉 కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను వైసీపీ నాయకులు మానుకోవాలని హెచ్చరించారు.👉 మాచర్లలో ప్రశాంతతను భంగం చేయాలని చూస్తే ప్రజలు, టీడీపీ శ్రేణులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.👉 బీసీ నాయకుడు మున్నా రాంబాబుపై, ఆయన ఇంటిపై పథకం ప్రకారమే దాడి జరిగిందని ఆరోపించారు. 👉 వారం రోజుల క్రితమే రాంబాబుపై దాడికి కుట్రలు జరిగాయని పేర్కొన్నారు.👉 మాచర్లలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే విద్వేషాలను రెచ్చగొడుతున్నారని…
పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి సమీపంలోని నెహ్రూ నగర్ తండాలో ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న తండావాసులకు శాశ్వత పరిష్కారం లభించింది. జనజీవనానికి దూరంగా, రాకపోకల సౌకర్యాలు కూడా సరిగా లేని ఈ తండాలో ప్రజలు చెరువులు, వాగుల నీటినే తాగుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈ సమస్యను గుర్తించిన రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల ప్రతినిధులు రోటరీ జిల్లా 3150 గవర్నర్ ఎస్వీ రాంప్రసాద్, అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ పంగులూరి విష్ణుబాబులకు వివరించారు. వారి సహకారంతో బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పి. బాలకోటి రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు పంగులూరి మురళి ఆధ్వర్యంలో సుమారు రూ.2 లక్షల విలువైన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను అందించారు.అదే సమయంలో మాచర్లకు చెందిన రంగమ్మ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ భూక్య శ్రీ సౌమ్యబాయి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మూడవత్ దశరథ్ చౌహన్…
ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ, “శ్యామరాజుపురంలో వెలసిన నాగజ్యోతి దుర్గా గంగా భవాని మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. పేదవాడి ఆకలి తీర్చడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదు. ఎన్టీఆర్ గారు చూపిన మార్గంలో, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ప్రతి ఏడాది ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అమ్మవారి కృపతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుర్గి టీడీపీ సీనియర్ నాయకులు నారయ్య, బూత్ ఇంచార్జి బుజ్జి, గ్రామ టీడీపీ అధ్యక్షులు డాన్ శీను, మాజీ సర్పంచ్ తాటి రామారావు, కండె నాగేశ్వరరావు, డీలర్ నాగేశ్వరరావు, సీతయ్య, హనుమంతరావు, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మాచర్ల పట్టణంలోని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సిద్ధా భత్తుని మురహరిరావు సతీమణి కల్పనా దేవి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమం నిర్వహించారు. మాచర్లలో ఉచిత విద్యను అందిస్తున్న సత్యసాయి విద్యా విహార్ అభివృద్ధి అవసరాల కోసం రూ.25 వేల విరాళాన్ని అందజేశారు.ఈ విరాళాన్ని కెసిపి సీనియర్ జనరల్ మేనేజర్ వివి రమణ, ఉదయ్ కుమార్, రోటరీ క్లబ్ ప్రతినిధుల సమక్షంలో జక్కా శ్రీనివాసరావుకు అందించారు.ఈ సందర్భంగా విద్యా సేవలకు చేయూతనందించిన డాక్టర్ మురహరిరావు – కల్పనా దేవి దంపతులను పలువురు అభినందించారు. సమాజంలో విద్యాభివృద్ధికి ఇటువంటి దాతృత్వ కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, “పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల సహకారంతోనే మాచర్లను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దగలం. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త బుట్టలను వినియోగించాలి. పారిశుధ్య కార్మికుల సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి” అని అన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తీసుకొచ్చాయని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ప్రతి నెల నిర్వహిస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు ప్రజల్లో బాధ్యతాభావాన్ని పెంపొందిస్తున్నాయని తెలిపారు.పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం కాపాడబడుతుందని, పారిశుధ్య నిర్వహణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల…
పల్నాడు జిల్లా పరిధిలో విద్యుత్ రెవెన్యూ వసూళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఏపీ సీపీడీసీఎల్ పరిధిలోని మాచర్ల విద్యుత్ డివిజన్‌లో 100 శాతం డిమాండ్ (డీఎండీ) వసూళ్లు సాధించిన సందర్భంగా గురువారం పిడుగురాళ్లలోని వల్లెల గార్డెన్స్‌లో అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన పల్నాడు జిల్లా సర్కిల్ విద్యుత్ ఎస్‌ఈ డా. విజయ్ కుమార్ చేతుల మీదుగా దాచేపల్లి సబ్ డివిజన్‌కు చెందిన ఈఆర్‌వో/జేఏఓ కె. ఆశీర్వాదం, సీనియర్ అసిస్టెంట్ సీహెచ్ గోపాలకృష్ణ కిషోర్ బాబు, జూనియర్ అసిస్టెంట్ ఆలీ సాహెబ్‌లకు ప్రశంసాపత్రాలు, షీల్డ్‌లు అందజేశారు.అవార్డు గ్రహీతలను మాచర్ల ఈఈ (ఆపరేషన్) ఎన్. సింగయ్య, ఏఏఓ పి. సందీప్ కుమార్, దాచేపల్లి డీఈఈ టీ. వీరేశ్వరరావు, దాచేపల్లి ఏఈఈలు అభినందించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఎం. మహేశ్వరావు మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి కార్డన్ సెర్చ్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, ఐపీఎల్ బెట్టింగ్‌లు, నాటుసారా తయారీ, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరిన డీఎస్పీ, ప్రజల సహకారంతోనే ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుందని పేర్కొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పార్క్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రాణికి సమస్యలపై వినతిపత్రాన్ని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెరిగిన ధరలను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యువకులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శిస్తూ, రానున్న రోజుల్లో అక్రమ కేసులు పెట్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్…
