
పల్నాడు జిల్లా పరిధిలో విద్యుత్ రెవెన్యూ వసూళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఏపీ సీపీడీసీఎల్ పరిధిలోని మాచర్ల విద్యుత్ డివిజన్‌లో 100 శాతం డిమాండ్ (డీఎండీ) వసూళ్లు సాధించిన సందర్భంగా గురువారం పిడుగురాళ్లలోని వల్లెల గార్డెన్స్‌లో అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పల్నాడు జిల్లా సర్కిల్ విద్యుత్ ఎస్‌ఈ డా. విజయ్ కుమార్ చేతుల మీదుగా దాచేపల్లి సబ్ డివిజన్‌కు చెందిన ఈఆర్‌వో/జేఏఓ కె. ఆశీర్వాదం, సీనియర్ అసిస్టెంట్ సీహెచ్ గోపాలకృష్ణ కిషోర్ బాబు, జూనియర్ అసిస్టెంట్ ఆలీ సాహెబ్‌లకు ప్రశంసాపత్రాలు, షీల్డ్‌లు అందజేశారు.
అవార్డు గ్రహీతలను మాచర్ల ఈఈ (ఆపరేషన్) ఎన్. సింగయ్య, ఏఏఓ పి. సందీప్ కుమార్, దాచేపల్లి డీఈఈ టీ. వీరేశ్వరరావు, దాచేపల్లి ఏఈఈలు అభినందించారు.
