
మాచర్ల పట్టణానికి చెందిన బీసీ సెల్ అధ్యక్షుడు మున్నా రాంబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారనే విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి తీవ్రస్థాయిలో స్పందించారు.
ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య వ్యాఖ్యలు:
👉 “నీ రక్తదాహం ఇంకా తీరలేదా రాక్షస రామకృష్ణారెడ్డి..!?” అంటూ మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు.
👉 బలహీన వర్గాలపై దాడులు చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు.
👉 కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను వైసీపీ నాయకులు మానుకోవాలని హెచ్చరించారు.
👉 మాచర్లలో ప్రశాంతతను భంగం చేయాలని చూస్తే ప్రజలు, టీడీపీ శ్రేణులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
👉 బీసీ నాయకుడు మున్నా రాంబాబుపై, ఆయన ఇంటిపై పథకం ప్రకారమే దాడి జరిగిందని ఆరోపించారు.
👉 వారం రోజుల క్రితమే రాంబాబుపై దాడికి కుట్రలు జరిగాయని పేర్కొన్నారు.
👉 మాచర్లలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
👉 మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడి మాటలు విని వైసీపీ నాయకులు జైలు పాలవుతారని హెచ్చరించారు.
👉 టీడీపీ నాయకులు, కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని, వారి ఆవేశం కట్టలు తెంచుకుంటే పరిస్థితులు అదుపులో ఉండవని అన్నారు.
👉 ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత వైసీపీ చేసిన రౌడీయిజాన్ని ప్రజలు మరవలేదన్నారు.
“పిన్నెల్లి రౌడీ రాజకీయం ఏ స్థాయిలో ఉందో గూగుల్ అడిగితే సాక్ష్యాలతో చూపిస్తోంది” అంటూ వ్యాఖ్యానించారు.
👉 జగన్ సైకో రాజకీయాలకు ఎన్నో కుటుంబాలు బలయ్యాయని ఆరోపించారు.
👉 నేషనల్ సర్వేల్లో వైసీపీ గ్రాఫ్ పడిపోతున్నా ఇంకా హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహించడం దారుణమన్నారు.
👉 మున్నా రాంబాబు కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దోషులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
