మాచర్ల పట్టణంలో గౌరవ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు 13వ మరియు 22వ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వేణు బాబు, మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు, బత్తుల వెంకటేశ్వర్లు (చిన్నబ్బాయి), ఉప్పుతోళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. డ్రైనేజీ శుభ్రపరిచే పనులు, వ్యర్థాల తొలగింపు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి పనులు నిర్వహించారు.స్థానిక ప్రజలు పారిశుద్ధ్య కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు
Author: myapnews9@gmail.com
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో బెల్టు దుకాణాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. మండలంలో అక్రమంగా బెల్టు షాపులు ఏరులై పారుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కండ్రిక గ్రామానికి బెల్టు షాపుల కోసం మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని గ్రామ మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామానికి మద్యం సరఫరా చేయవద్దని హెచ్చరిస్తూ ఆటోలో ఉన్న మద్యం సీసాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు.గ్రామాల్లో మద్యం విక్రయాల వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బెల్టు దుకాణాలను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం లో రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం పిలుపు మేరకు శనివారం ఆర్యవైశ్య ప్రముఖులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కారంపూడి ఆర్యవైశ్యులు. ముందుగా టీజీ వెంకటేష్ దంపతులు కు గోత్రనామాలతో ఆశీర్వచనాలు చేసిన వేద పండితులు సాగి మణికంఠ శాస్త్రి.అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ దురంధరుడు మాజీ రాజ్యసభ సభ్యులు మరియు మాజీ మంత్రి ఆర్యవైశ్య హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న టీజీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎస్పిఆర్ కృష్ణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు సముద్రాల పవన్ సాయి ఆర్యవైశ్య నాయకులు ఊటుకూరి రాము, కొమ్మూరి కిషోర్, ఆతుకూరి గోపి, భవిరిశెట్టి పూర్ణచంద్రరావు, కంభంపాటి సత్యనారాయణ,కర్నాటి మహేష్, చేపూరి రవీంద్ర, బచ్చు గురు సైదారావు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దుర్గి మండలం శ్యామరాజుపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మర్రిబోయిన శౌరీరాజ్ గారు అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సందర్భంగా వారి పార్థివ దేహాన్ని సందర్శించిన టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ యాగంటి మల్లికార్జునరావు గారు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం శౌరీరాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన యాగంటి మల్లికార్జునరావు గారు, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శౌరీరాజ్ గారి భార్యకు త్వరలో పింఛన్ మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటి రామారావు గారు, టీడీపీ నాయకులు తిక్క కొండల, డాన్ శీను, బూత్ ఇన్‌చార్జి బుజ్జి, నాగేశ్వరరావు, ప్రసాదు, పిన్నంశెట్టి కృష్ణ, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు , డీఈ రాఘవ గారు, వార్డు నాయకులు మున్న రాంబాబు, కామనబోయిన కాశిలింగం, మున్న హనుమంతు, పచ్చిపాల అనురాధ, విర్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు కొన్ని గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సీఐ తెలిపారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రజలకు సూచించారు. అలాగే యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒక సీఐ, ఐదుగురు ఎస్ఐలు, 35 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
మాచర్ల 24వ వార్డులో పారిశుద్ధ పనులు… ఎమ్మెల్యే ఆదేశాలతో చర్యలు వేగవంతంమాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 24వ వార్డులో పారిశుద్ధ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వేణు బాబు, డీఈ రాఘవ, వార్డు ఇన్‌చార్జి కోమటి వీరు తదితరులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. డ్రైనేజీ శుభ్రపరిచే పనులు, వ్యర్థాల తొలగింపు, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రత్యక్షంగా పనులను నిర్వహింపజేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్… డిసెంబర్‌లోగా స్థానిక ఎన్నికలు పూర్తి? ఏపీలో కసరత్తు వేగంఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించే దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, 2027 కొత్త సంవత్సర ఆరంభానికే నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.నోటిఫికేషన్‌కు ముందు అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్ల అంశంపై డెడికేటెడ్ కమిషన్ వచ్చే నెలలో నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా జూలై నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా…
మాచర్లలో ట్రాఫిక్ సమస్యలపై పోలీసుల దృష్టి… సహకారం లేకపోతే చర్యలు తప్పవుమాచర్ల పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల అర్బన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ నజీర్ బేగ్, పట్టణ ఎస్సై కత్తి స్వర్ణలతతో కలిసి ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా సీఐ మహమ్మద్ నజీర్ బేగ్ మాట్లాడుతూ, మాచర్ల పట్టణానికి పరిసర గ్రామాల నుంచి భారీగా ప్రజలు రాకపోకలు సాగించడం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. దీనికి తోడు పట్టణంలో కొనసాగుతున్న హైవే పనులు కూడా ట్రాఫిక్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయని పేర్కొన్నారు ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా అధిగమించేందుకు వ్యాపారులు, వాహనదారులు, సాధారణ ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్లపై అక్రమ పార్కింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి చర్యలు సమస్యలకు కారణమవుతున్నాయని తెలిపారు.అదే సమయంలో, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో…
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా మారిందని టీడీపీ సీనియర్ నేత యాగంటి మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు.రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వ పరిపాలనా దక్షత స్పష్టంగా కనిపిస్తోందని, ఈ పెట్టుబడుల ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులు ఈ నెలలో ప్రారంభించి 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పుట్టపర్తిలో రూ.15 వేల కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం, డ్రోన్ సిటీ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త దిశను నిర్దేశిస్తున్నాయని చెప్పారు.క్యారియర్ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసి 3 వేల మందికి ఉపాధి కల్పించనుందని,…
