
దుర్గి మండలం శ్యామరాజుపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మర్రిబోయిన శౌరీరాజ్ గారు అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సందర్భంగా వారి పార్థివ దేహాన్ని సందర్శించిన టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ యాగంటి మల్లికార్జునరావు గారు ఘనంగా నివాళులు అర్పించారు

అనంతరం శౌరీరాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన యాగంటి మల్లికార్జునరావు గారు, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శౌరీరాజ్ గారి భార్యకు త్వరలో పింఛన్ మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటి రామారావు గారు, టీడీపీ నాయకులు తిక్క కొండల, డాన్ శీను, బూత్ ఇన్‌చార్జి బుజ్జి, నాగేశ్వరరావు, ప్రసాదు, పిన్నంశెట్టి కృష్ణ, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
