
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం లో రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం పిలుపు మేరకు శనివారం ఆర్యవైశ్య ప్రముఖులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కారంపూడి ఆర్యవైశ్యులు. ముందుగా టీజీ వెంకటేష్ దంపతులు కు గోత్రనామాలతో ఆశీర్వచనాలు చేసిన వేద పండితులు సాగి మణికంఠ శాస్త్రి.అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ దురంధరుడు మాజీ రాజ్యసభ సభ్యులు మరియు మాజీ మంత్రి ఆర్యవైశ్య హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న టీజీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎస్పిఆర్ కృష్ణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు సముద్రాల పవన్ సాయి ఆర్యవైశ్య నాయకులు ఊటుకూరి రాము, కొమ్మూరి కిషోర్, ఆతుకూరి గోపి, భవిరిశెట్టి పూర్ణచంద్రరావు, కంభంపాటి సత్యనారాయణ,కర్నాటి మహేష్, చేపూరి రవీంద్ర, బచ్చు గురు సైదారావు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
