
మాచర్ల పట్టణంలో గౌరవ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు 13వ మరియు 22వ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వేణు బాబు, మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు, బత్తుల వెంకటేశ్వర్లు (చిన్నబ్బాయి), ఉప్పుతోళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
డ్రైనేజీ శుభ్రపరిచే పనులు, వ్యర్థాల తొలగింపు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి పనులు నిర్వహించారు.
స్థానిక ప్రజలు పారిశుద్ధ్య కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు
