Author: myapnews9@gmail.com

మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం మాచర్ల పట్టణంలోని 5వ, 22వ వార్డుల్లో NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్-3 ఇన్చార్జి, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు, 82వ బూత్ ఇన్చార్జి నరా రాముడు, 92వ బూత్ ఇన్చార్జి తమిశెట్టి ఏడుకొండలు, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఓర్సు క్రాంతి కుమార్, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మధినేటి శాంతి, టీడీపీ కార్యకర్త ఎ. వాసు, పట్టణ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ కొమెర సాంబ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో NTR…

Read More

మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణం నరిశెట్టి కళ్యాణ మండపంలో APSRTC విభాగంలో సూపర్‌వైజర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన కొనుగంటి పూర్ణచంద్ర శేఖర్ రెడ్డి కి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలో నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించి సహోద్యోగులు, ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న పూర్ణచంద్ర శేఖర్ రెడ్డి సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో ఆయన అందించిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.అనంతరం పదవీ విరమణ పొందిన పూర్ణచంద్ర శేఖర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి పదవీ విరమణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు మరియు పలువురు ప్రముఖులు…

Read More

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మహానాడు సభల విజయంపై స్పందించారు. మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మహానాడు ద్వారా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన సందేశం వెళ్లిందన్నారు. గత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, “వెన్నుపోటు” అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంపు, మద్యం విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు.పెట్టుబడుల ద్వారా యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు రోజుకు 16 నుంచి 18 గంటల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రకృతి విపత్తుల సమయంలో…

Read More

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై స్పందించారు.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. మహిళా సంక్షేమం, ఐటీ రంగ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు.మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి భారీ కంపెనీలు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజలతో మమేకమైన నాయకుడని కొనియాడిన యరపతినేని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, జూలకంటి కుటుంబంతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా ఆత్మీయ అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. మాచర్ల – గురజాల నియోజకవర్గాలు అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారంపై…

Read More

వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జూలకంటి కుటుంబంతో, కుర్రి పున్నారెడ్డితో తమకు ఎంతోకాలంగా ఆత్మీయ అనుబంధం కొనసాగుతోందని యరపతినేని తెలిపారు.రాజకీయాలకు అతీతంగా కుటుంబ సంబంధాలు మరింత బలంగా ఉన్నాయని, మాచర్ల – గురజాల ప్రాంతాల ప్రజలు కూడా ఎప్పటిలాగే అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గాంబ, కుర్రి పున్నారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి ధైర్యం చెప్పారు.

Read More

మాచర్ల పట్టణంలో బక్రీద్ పండగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఈద్గా వద్ద భారీ సంఖ్యలో ముస్లింలు చేరుకొని ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు. దేశం, రాష్ట్రం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అల్లాహ్‌ను ప్రార్థించారు.ఈ సందర్భంగా ముస్లిం మత గురువు బక్రీద్ పండుగ విశిష్టతను వివరించారు. త్యాగం, విశ్వాసం, మానవత్వానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని తెలిపారు. అల్లాహ్ ఆజ్ఞ కోసం ఇబ్రహీం ప్రవక్త చూపిన త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారని చెప్పారు. సమాజంలో ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందించే సందేశాన్ని బక్రీద్ అందిస్తుందని పేర్కొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్నారులు, యువకులు, పెద్దలు కొత్త దుస్తుల్లో సందడి చేశారు. పండగ సందర్భంగా మాచర్లలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Read More

పిడుగురాళ్ళ, దాచేపల్లి ప్రాంతాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ శుభవార్త తెలిపింది. బక్రీద్ పర్వదినం సందర్భంగా గురువారం ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, అలాగే నెల చివరి ఆదివారం రోజున కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపుకు అవకాశం కల్పించినట్లు అసిస్టెంట్ అకౌంట్ అధికారి పి. సందీప్ కుమార్, డీఈఈ టి. వీరేశ్వరరావు, ఏఈలు బి. భగవాన్, డి. నాగేశ్వరరావు, జేఏవో కె. ఆశీర్వాదం సంయుక్త ప్రకటనలో తెలిపారు. పిడుగురాళ్ళ, దాచేపల్లి విద్యుత్ కార్యాలయాల్లో బిల్లులు స్వీకరించే కౌంటర్లు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామాల్లో విద్యుత్ బిల్లుల వసూళ్ల కోసం సిబ్బంది పర్యటిస్తారని తెలిపారు. వినియోగదారులు తమ పాత మరియు ప్రస్తుత బకాయిలను వెంటనే చెల్లించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.

Read More

తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిజిటల్ మహానాడు–2026 కార్యక్రమంలో భాగంగా మాచర్ల పట్టణంలోని క్లస్టర్–002 పరిధిలోని BSR కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్న మహిళా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. అలాగే మహానాడు సంకల్ప సందేశాన్ని కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ..“తెలుగుదేశం పార్టీ పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు…

Read More

దాచేపల్లి పట్టణం మరియు మండల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు మంగళవారం విజయవంతంగా పూర్తయ్యాయి. సోమవారం వచ్చిన గాలివాన బీభత్సానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఈ క్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి వేగంగా విద్యుత్ పునరుద్ధరణ చేపట్టారు.ఈ సందర్భంగా దాచేపల్లి పట్టణ, మండల ప్రజల తరఫున మాచర్ల విద్యుత్ డివిజన్ ఈఈ సింగరయ్య, డీఈఈ టి. వీరేశ్వరరావు, దాచేపల్లి పట్టణ మరియు రూరల్ ఏఈఈలు బి. భగవాన్, డి. నాగేశ్వరరావు విద్యుత్ సిబ్బంది కృషిని అభినందిస్తూ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More