
దాచేపల్లి పట్టణం మరియు మండల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు మంగళవారం విజయవంతంగా పూర్తయ్యాయి. సోమవారం వచ్చిన గాలివాన బీభత్సానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి వేగంగా విద్యుత్ పునరుద్ధరణ చేపట్టారు.
ఈ సందర్భంగా దాచేపల్లి పట్టణ, మండల ప్రజల తరఫున మాచర్ల విద్యుత్ డివిజన్ ఈఈ సింగరయ్య, డీఈఈ టి. వీరేశ్వరరావు, దాచేపల్లి పట్టణ మరియు రూరల్ ఏఈఈలు బి. భగవాన్, డి. నాగేశ్వరరావు విద్యుత్ సిబ్బంది కృషిని అభినందిస్తూ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు.
