
పిడుగురాళ్ళ, దాచేపల్లి ప్రాంతాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ శుభవార్త తెలిపింది. బక్రీద్ పర్వదినం సందర్భంగా గురువారం ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, అలాగే నెల చివరి ఆదివారం రోజున కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపుకు అవకాశం కల్పించినట్లు అసిస్టెంట్ అకౌంట్ అధికారి పి. సందీప్ కుమార్, డీఈఈ టి. వీరేశ్వరరావు, ఏఈలు బి. భగవాన్, డి. నాగేశ్వరరావు, జేఏవో కె. ఆశీర్వాదం సంయుక్త ప్రకటనలో తెలిపారు.
పిడుగురాళ్ళ, దాచేపల్లి విద్యుత్ కార్యాలయాల్లో బిల్లులు స్వీకరించే కౌంటర్లు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామాల్లో విద్యుత్ బిల్లుల వసూళ్ల కోసం సిబ్బంది పర్యటిస్తారని తెలిపారు.
వినియోగదారులు తమ పాత మరియు ప్రస్తుత బకాయిలను వెంటనే చెల్లించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.
