Author: myapnews9@gmail.com

మాచర్ల: హనుమాన్ జయంతి సందర్భంగా మాచర్ల శ్రీశైలం రోడ్డులోని శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొలువుదీరిన శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ అధికారులు, భక్తులు ఎమ్మెల్యే దంపతులను స్వాగతించి ఆశీర్వాదాలు అందించారు.

Read More

కార్యక్రమం అనంతరం డీఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రజలకు అవగాహన కల్పిస్తూ మత్తు పదార్థాల వినియోగం, రోడ్డు భద్రత, క్రికెట్ బెట్టింగ్ మరియు ప్యాక్షన్ గొడవలపై జాగ్రత్తలు సూచించారు. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి పత్రాలు చూపించి తిరిగి పొందవచ్చని తెలిపారు.

Read More

మాచర్ల పట్టణ సిఐగా మహమ్మద్ నజీర్ బేగ్ నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.సీఐ మహమ్మద్ నజీర్ బేగ్ మాట్లాడుతూ, మాచర్ల పట్టణంలో చట్టం మరియు శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజలకు భయం లేకుండా జీవించే వాతావరణాన్ని కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలు, జూదం, బెట్టింగ్, మద్యం అక్రమ రవాణా వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే, ప్రజలు పోలీసులతో సహకరించి నేరాలను అరికట్టడంలో భాగస్వాములు కావాలని కోరారు. సమస్యలపై ఎప్పుడైనా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

Read More

మాచర్లలో ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్ – రూ.3.40 లక్షలు, 8 మొబైళ్లు సీజ్పల్నాడు జిల్లా ఎస్పీ, గురజాల డీఎస్పీ ఆదేశాల మేరకు మాచర్ల టౌన్ పోలీసుల దాడుల్లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.మే 8వ తేదీ రాత్రి మాచర్ల రైల్వే స్టేషన్ రోడ్డులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో, అనుమానాస్పదంగా కూర్చొని మొబైల్ ఫోన్లలో బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆటలు ఆడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.పోలీసులు వారి మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా “రాడే ఎక్స్చేంజ్”, “నేషనల్ 77”, “ది టైగర్ 247” వంటి యాప్స్ ద్వారా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.అరెస్ట్ చేసిన వారిలో మారంరెడ్డి సురేష్ రెడ్డి, చుండూరు సుధాకర్, బొడ్డు అమరలింగయ్య, కోలా శ్రీధర్, పట్టాన్ జానీ, కందుల యేసు ఉన్నారు.వారి వద్ద నుండి 8 సెల్ ఫోన్లు మరియు రూ.3,40,800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో…

Read More

మండల కేంద్రం దుర్గిలో శ్రీ సాయి వెంకటేష్ పాలీ క్లినిక్ ప్రాక్టీషనర్ బండారు నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం మంచి నీటి చలి వేంద్రాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ వడ్డే శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు మన ప్రాణాధారం అని, దాన్ని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వేసవి కాలంలో నీటి వినియోగంపై జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోట యోహాను, బ్యాంకు క్యాషియర్ షేక్ మజ్ను, క్లినిక్ సిబ్బంది, వై. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.

Read More

పల్నాడు జిల్లా – మాచర్ల నియోజకవర్గం నేరచరిత్ర కలిగిన ముగ్గురికి జిల్లా బహిష్కరణపల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెం గ్రామంలో నేరచరిత్ర కలిగిన ముగ్గురు వ్యక్తులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న నేపథ్యంలో, వారికి జిల్లా బహిష్కరణ విధిస్తూ కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా, ఐఏఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, పై ముగ్గురిని 6 నెలల పాటు పల్నాడు జిల్లా పరిధి నుండి బహిష్కరించారు. బహిష్కరణకు గురైన వారు:పంగా ఇద్దయ్య (28సం), తండ్రి: మల్లయ్యపంగా అంజయ్య @ అంజి (54సం), తండ్రి: పెద్ద కాశయ్యగన్నెబోయిన లక్ష్మయ్య (51సం), తండ్రి: గురవయ్య(ముగ్గురూ యాదవ కులానికి చెందిన వారు, కొత్తపుల్లారెడ్డిగూడెం గ్రామం, వెల్దుర్తి మండలం) వీరిపై ఒక్కొక్కరికి మూడు నుండి నాలుగు వరకు వివిధ నేర కేసులు నమోదై ఉన్నాయి.🔹 మార్చి 7వ తేదీన గ్రామంలో బయటపడిన…

Read More

పల్నాడు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి స్వామివారి వెండి కిరీటం, వెండి గదను అపహరించుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు.ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గుర్తించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అనంతరం గ్రామస్థులు వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న ఎస్ఐ ఉదయలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More

జయంతి నగర్‌లో ST కుటుంబాల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే జూలకంటిమాచర్ల పట్టణంలోని జయంతి నగర్‌లో నివసిస్తున్న పలు ఎస్టీ కమ్యూనిటీ కుటుంబాలు ప్రాథమిక సౌకర్యాల కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిన వెంటనే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.ఈ ప్రాంతంలో ఇప్పటివరకు సరైన సీసీ రోడ్లు లేకపోవడం, తాగునీటి సదుపాయం లేకపోవడం వంటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముందుగా పిల్లలను పాఠశాలకు పంపాలని సూచిస్తూ, “మీకు అవసరమైన సౌకర్యాలన్నింటినీ అందించే బాధ్యత నా దే” అని హామీ ఇచ్చారు.అవసరమైన మౌలిక వసతులను త్వరలోనే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

Read More