
పల్నాడు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి స్వామివారి వెండి కిరీటం, వెండి గదను అపహరించుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు.
ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గుర్తించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అనంతరం గ్రామస్థులు వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న ఎస్ఐ ఉదయలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
