
ఈ తనిఖీలలో ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు సహా సుమారు 30 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 28 టూ వీలర్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5 కొడవళ్లు, 5 గడ్డపారులు, 6 కత్తులు వంటి మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కార్యక్రమం అనంతరం డీఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రజలకు అవగాహన కల్పిస్తూ మత్తు పదార్థాల వినియోగం, రోడ్డు భద్రత, క్రికెట్ బెట్టింగ్ మరియు ప్యాక్షన్ గొడవలపై జాగ్రత్తలు సూచించారు. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి పత్రాలు చూపించి తిరిగి పొందవచ్చని తెలిపారు.
