
మాచర్ల పట్టణ సిఐగా మహమ్మద్ నజీర్ బేగ్ నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
సీఐ మహమ్మద్ నజీర్ బేగ్ మాట్లాడుతూ, మాచర్ల పట్టణంలో చట్టం మరియు శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజలకు భయం లేకుండా జీవించే వాతావరణాన్ని కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలు, జూదం, బెట్టింగ్, మద్యం అక్రమ రవాణా వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే, ప్రజలు పోలీసులతో సహకరించి నేరాలను అరికట్టడంలో భాగస్వాములు కావాలని కోరారు. సమస్యలపై ఎప్పుడైనా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
