
ముందుగా ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించగా, గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం యాగంటి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది భక్తులు, పేదలకు స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు.
ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ, “శ్యామరాజుపురంలో వెలసిన నాగజ్యోతి దుర్గా గంగా భవాని మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. పేదవాడి ఆకలి తీర్చడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదు. ఎన్టీఆర్ గారు చూపిన మార్గంలో, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ప్రతి ఏడాది ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అమ్మవారి కృపతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుర్గి టీడీపీ సీనియర్ నాయకులు నారయ్య, బూత్ ఇంచార్జి బుజ్జి, గ్రామ టీడీపీ అధ్యక్షులు డాన్ శీను, మాజీ సర్పంచ్ తాటి రామారావు, కండె నాగేశ్వరరావు, డీలర్ నాగేశ్వరరావు, సీతయ్య, హనుమంతరావు, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
