
యూపీలోని కౌశాంబీ జిల్లాలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. మేకలు, గొర్రెలను తరలిస్తున్న ఓ ట్రక్కు ప్రమాదానికి గురికాగా.. స్థానికులు సహాయం చేయాల్సింది పోయి గొర్రెలను ఎత్తుకెళ్లడంలో మునిగిపోయారు.
ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడినా ఎవరూ పట్టించుకోలేదు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఒకరి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికుల నిర్లక్ష్య వైఖరిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
