
మాచర్ల నియోజకవర్గ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు మాచర్ల పట్టణంలోని PWD కాలనీ వాణి గ్రౌండ్‌లో SFI ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలకు మాచర్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీ యెనుముల కేశవరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేత జట్లకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా మొత్తం ₹35,000 నగదు ప్రోత్సాహకాలను అందజేసి అభినందించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావనను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

యువత అన్ని రంగాల్లో రాణించాలంటే క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
