
పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లపై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి. ఆంజనేయులు అధికారులను ఆదేశించారు

ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు 24 గంటల్లోనే చర్యలు చేపట్టిన వినుకొండ సీఐ ప్రభాకర్, అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న రెండు భారీ టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ భూముల్లో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీల సహాయంతో గ్రావెల్ తవ్వి, టిప్పర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి మంగళవారం వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎవరైనా అక్రమంగా గ్రావెల్ (మట్టి) తరలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రభాకర్ హెచ్చరించారు
