Author: myapnews9@gmail.com

ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత, స్థిరమైన ఆదాయం, సమాజంలో గౌరవం — ఇవన్నీ కలిపి ఒక మంచి జీవితం. కానీ ఆ అవకాశాన్ని కొందరు అధికారులు స్వార్థం కోసం వాడుకుంటూ అవినీతి బాట పడటం ఆందోళన కలిగించే విషయం.బాపట్ల మునిసిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న షేక్ ఇమామ్ అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ లంచం డిమాండ్ చేసిన ఘటనలో ఏసీబీకి చిక్కి అవినీతి బండారం బహిర్గతమైంది.ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ వివరాల ప్రకారం:దేవరకొండ సుబ్బారావు అనే వ్యక్తి బాపట్ల పట్టణంలో భార్య, కూతురు పేర్లపై రెండు ఇళ్లు కొనుగోలు చేసి, ఇంటి పన్ను పేరు మార్పు కోసం మునిసిపల్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు.భార్య పేరుతో ఉన్న ఇంటి పన్ను పేరు మార్పు కోసం రూ.25,000 ప్రభుత్వ ఫీజుతో పాటు మరో రూ.25,000 లంచంగా ఇమామ్‌కు చెల్లించి పని చేయించుకున్నాడు. తర్వాత కూతురు పేరుతో ఉన్న ఇంటి పన్ను మార్పు…

Read More

ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ నిరంజన్ మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించబోమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అపరిచిత వ్యక్తులు గ్రామంలో కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ తనిఖీలతో గ్రామంలో భద్రతా పరిస్థితులు మరింత బలపడతాయని పోలీసులు పేర్కొన్నారు.

Read More

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఇంధన సరఫరాపై అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, డీఎస్పీ హనుమంతరావు, ఆర్డీవో రమాకాంత్ రెడ్డి, ఎమ్మార్వో కేఎస్ చక్రవర్తి కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు మరియు పంపిణీ విధానాన్ని అధికారులు స్వయంగా పరిశీలించారు. ప్రత్యేకంగా కలెక్టర్ కృతిక శుక్ల స్వయంగా బంకులో పెట్రోల్ కొట్టి పరిస్థితిని అంచనా వేసి, పారదర్శకతను నిర్ధారించారు.అనంతరం మాట్లాడిన కలెక్టర్, పెట్రోల్–డీజిల్ దొరకవనే భయంతో ప్రజలు ముందుగానే క్యాన్లలో నింపుకుని నిల్వ చేసుకోవద్దని స్పష్టంగా సూచించారు. జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత ఉండబోదని భరోసా ఇచ్చారు.ఈరోజు మధ్యాహ్నం నాటికి ఎలాంటి కొరత లేకుండా సరఫరా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.ప్రజలు పుకార్లు నమ్మకుండా, అవసరానికి మాత్రమే ఇంధనం వినియోగించుకోవాలని, సహకరించాలని కలెక్టర్ కృతిక…

Read More

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో కుటుంబ వివాదం తీవ్రరూపం దాల్చి దాడికి దారితీసింది. పట్టణంలోని సంజయ్ గాంధీ నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో గౌతమ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం ప్రకారం, గౌతమ్‌కు తన భార్యతో పాటు అత్తామామలతో కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన వాగ్వాదం క్రమంగా హింసాత్మకంగా మారి, భార్యతో కలిసి అత్తామామలు గౌతమ్‌పై రోకలి బండతో దాడి చేసినట్లు తెలుస్తోంది.దాడిలో గాయపడిన గౌతమ్‌ను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.ఈ ఘటనపై బాధితుడు గౌతమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read More

గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రినిటీ యూనో ట్రేడర్స్ అల్యూమినియం కంపెనీలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారితీసింది.మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్, ధీరజ్ పరుస్తా అనే ఇద్దరు కార్మికులు మద్యం మత్తులో రాత్రి 11 గంటల సమయంలో గొడవకు దిగినట్లు సమాచారం. చిన్న వివాదంగా ప్రారంభమైన తగువు క్రమంగా తీవ్రరూపం దాల్చి, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది.ఈ క్రమంలో కంపెనీలోని గ్లాస్ డోర్ పగలగొట్టబడగా, ధీరజ్‌కు చేతికి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. గాయంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆయన అక్కడికక్కడే కుప్పకూలినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు.ఘటనపై కేసు నమోదు చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు, ఇది…

Read More

ఈ సందర్భంగా బంకుల్లో అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలను స్వయంగా తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మినిమం స్టాక్‌ను తప్పనిసరిగా నిల్వ ఉంచాలని, ముఖ్యంగా అంబులెన్స్‌లు, అత్యవసర సేవలకు ఇంధనం అందుబాటులో ఉండేలా చూడాలని తాసిల్దార్ ఆదేశించారు. అదేవిధంగా పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి, వారి ఆధ్వర్యంలో నిరంతర పరిశీలన కొనసాగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని యాజమాన్యాలకు సూచించారు. ఈ చర్యలతో మాచర్లలో ఇంధన కొరత లేకుండా ఉండేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు

Read More

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసు విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. మాచర్ల పట్టణానికి కొత్త అర్బన్ ఎస్సైగా కత్తి స్వర్ణలత బాధ్యతలు స్వీకరించారు.నర్సరావుపేట ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత బదిలీపై మాచర్లకు రాగా, ఆదివారం ఆమె అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. స్థానిక పోలీసు సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.ఇప్పటి వరకు మాచర్ల అర్బన్ ఎస్సైగా సేవలందించిన రమేష్ బదిలీపై వెళ్లడంతో, ఆయన స్థానంలో స్వర్ణలత నియమితులయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్వర్ణలత ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.మాచర్ల పట్టణంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

Read More

గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది.బెంగళూరు నుంచి అర్ధరాత్రి విజయవాడకు చేరుకున్న ఓ యువతి, బస్టాండ్‌లో ఆటో ఎక్కగా డ్రైవర్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు.మంగళగిరి దాటిన తర్వాత చినకాకాని సమీపంలో ఆటోలోనే యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్, అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన యువతి వెంటనే శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది.అలర్ట్ అయిన మంగళగిరి గ్రామీణ పోలీసులు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పారిపోతున్న ఆటో డ్రైవర్‌ను ఎస్‌.ఐ. వెంకట్‌ వెంబడించి పట్టుకున్నారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాధిత యువతిని సురక్షితంగా ఆమె స్వస్థలానికి చేర్చారు.👉 ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని లైబ్రరీ సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పఠాన్ రాజుబుడే అనే వ్యక్తి మద్యం సేవించి తన భార్య, పిల్లలపై దూషణలకు దిగడంతో వివాదం ప్రారంభమైంది.అదే సమయంలో సమీపంలో ఉన్న మరో కుటుంబానికి చెందిన మహిళ తననే దూషిస్తున్నాడని భావించి రాజుబుడేతో వాగ్వాదానికి దిగింది.దీంతో ఆమె తన బంధువులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న వారు రాజుబుడేపై కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. గొడవ తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను విడదీశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.దాడిలో తీవ్రంగా గాయపడిన రాజుబుడేను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Read More

దాచేపల్లిలో డ్వాక్రా (DWCRA) నిధుల దుర్వినియోగం ఘటన వెలుగులోకి వచ్చింది. యాసిన్ పొదుపు గ్రూపుకు చెందిన సుమారు రూ. 7 లక్షలను గ్రూప్ లీడర్ నూర్జహాన్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.సభ్యులు పొదుపుగా జమ చేసిన ఈ డబ్బుతో నూర్జహాన్ ఇల్లు నిర్మించడంతో పాటు బైక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మోసం జరిగినట్లు గ్రూప్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.దర్యాప్తు అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆమెను గురజాల జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.

Read More