
దాచేపల్లిలో డ్వాక్రా (DWCRA) నిధుల దుర్వినియోగం ఘటన వెలుగులోకి వచ్చింది. యాసిన్ పొదుపు గ్రూపుకు చెందిన సుమారు రూ. 7 లక్షలను గ్రూప్ లీడర్ నూర్జహాన్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సభ్యులు పొదుపుగా జమ చేసిన ఈ డబ్బుతో నూర్జహాన్ ఇల్లు నిర్మించడంతో పాటు బైక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మోసం జరిగినట్లు గ్రూప్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తు అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆమెను గురజాల జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
