ఈ సందర్భంగా బంకుల్లో అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలను స్వయంగా తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మినిమం స్టాక్‌ను తప్పనిసరిగా నిల్వ ఉంచాలని, ముఖ్యంగా అంబులెన్స్‌లు, అత్యవసర సేవలకు ఇంధనం అందుబాటులో ఉండేలా చూడాలని తాసిల్దార్ ఆదేశించారు. అదేవిధంగా పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి, వారి ఆధ్వర్యంలో నిరంతర పరిశీలన కొనసాగుతుందని తెలిపారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని యాజమాన్యాలకు సూచించారు. ఈ చర్యలతో మాచర్లలో ఇంధన కొరత లేకుండా ఉండేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు