
యువతకు ఉపాధి అవకాశాల వేదిక – ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
మాచర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎస్‌వీఆర్ డిగ్రీ కళాశాల, కృష్ణవేణి జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ (మంగళవారం) ఉదయం 9 గంటలకు మాచర్లలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జాబ్ మేళా పోస్టర్‌ను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని సూచించారు.
ఈ జాబ్ మేళాలో 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. టీమ్ కంప్యూటర్స్, మెడ్‌ప్లస్, హీరో మోటార్ వర్క్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్, అపోలో టైర్స్, యమహా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెటిరో డ్రగ్స్ తదితర సంస్థలు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. అభ్యర్థుల విద్యార్హతలను బట్టి నెలకు రూ.15,000 నుంచి రూ.35,000 వరకు వేతనాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు.
అర్హతలు
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, పీజీ వరకు చదివిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనవచ్చు.
తీసుకురావాల్సిన పత్రాలు
బయోడేటా / రెజ్యూమ్
విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు
ఆధార్ కార్డు ప్రతులు
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
జాబ్ మేళా వివరాలు
📅 తేదీ: 30-06-2026 (మంగళవారం)
⏰ సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు
📍 స్థలం: కృష్ణవేణి జూనియర్ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, మాచర్ల, పల్నాడు జిల్లా
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
📞 కిరణ్: 7842747682
📞 శ్రీకాంత్: 9492158153
అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి చేయని వారు జాబ్ మేళా ప్రాంగణంలోనే నమోదు చేసుకునే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
