Author: myapnews9@gmail.com

నరసరావుపేటలో వైసీపీ సోషల్ మీడియా వర్కర్ షేక్ నాగురుబాబు అలియాస్ హన్నుపై జరిగిన దాడి కేసుకు సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు రాజకీయ కోణం లేదని, ఇది పూర్తిగా వ్యక్తిగత వివాదం ఫలితమని డీఎస్పీ ఎం. హనుమంతరావు స్పష్టం చేశారు.ఎన్ఈసీ కళాశాలలో చదువుతున్న ఓ యువతితో స్నేహం విషయంలో ఇద్దరు యువకుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో హన్నుకు తలకు గాయమై, చికిత్స అనంతరం కోలుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.ఈ ఘటనను రాజకీయ రంగు పులుమడం తగదని, వాస్తవాలను వక్రీకరించకుండా ప్రజలు సహకరించాలని డీఎస్పీ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.

Read More

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే దేశ అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని యాగంటి పేర్కొన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.ఎన్డీఏ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని ఆయన స్వాగతించారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పెంపు వంటి కీలక అంశాలకు ఆమోదం లభించాలని ఆకాంక్షించారు.అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, వారికి చట్టసభల్లో మాట్లాడే అవకాశాలు కల్పించడం ద్వారా నారీ గళం మరింత బలపడుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తోందని, వారి అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తోందని తెలిపారు. అలాగే నియోజకవర్గాల పెంపు…

Read More

దోమల కాయిల్ దుర్ఘటన… కంటెపూడిలో వ్యక్తి సజీవ దహనంపల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో దోమల బెడదతో రాత్రి సమయంలో దోమల కాయిల్ (చక్రం) వెలిగించి నిద్రపోయిన నాగేశ్వరరావు, అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.దోమల కాయిల్ నుంచి వచ్చిన నిప్పురవ్వ దుప్పటికి అంటుకోవడంతో మంటలు వ్యాపించి నాగేశ్వరరావు సజీవ దహనమైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ మరణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి

Read More

గుంటూరు: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో గుంటూరులో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో దాడులు నిర్వహించి మొత్తం 15 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు.లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడులు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లావత్ నాయక్ అనే వ్యక్తి “నేషనల్ ఎక్స్చేంజ్” యాప్ ద్వారా ఇతరులతో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో రూ.1,25,000 నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అలాగే ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌కే రియాజ్ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఆఫ్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.75,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, ఐపీఎల్ సీజన్‌ను అవకాశంగా…

Read More

దాచేపల్లి: విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను సకాలంలో చెల్లించాలని మాచర్ల ఈఈ సింగయ్య కోరారు. గురువారం నారాయణపురం కార్యాలయంలో సిబ్బందితో విద్యుత్ బిల్లుల వసూళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులు తమ ఇళ్లు, దుకాణాలకు సంబంధించిన కరెంటు బిల్లులను ప్రతి నెలా బకాయిలు లేకుండా చెల్లించాలని సూచించారు. అలాగే అధికారులు, ఉద్యోగులు నెలవారీ వసూళ్లతో పాటు పెండింగ్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నూరు శాతం వసూళ్ల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఏఏఓ సందీప్ కుమార్, జేఏఓ ఆశీర్వాదం, డీఈఈ వీరేశ్వరరావు, ఏఈలు భగవాన్, దండా నాగేశ్వరరావు, సబ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఇటీవలి కాలంలో సుమారు 50 కాటన్ సెర్చ్‌లు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా గొడవలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇటీవలి కాలంలో యువతలో గంజాయి వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా విద్యార్థులు కూడా దీనికి బానిసలవుతున్నారని చెప్పారు. గంజాయి అలవాటు కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, అక్రమ కార్యకలాపాలు, పేకాట శిబిరాలపై సమాచారం ఉంటే వెంటనే 112కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Read More

ఈ సందర్భంగా గ్రామంలో అనుమానితులుగా భావించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Read More

మాచర్ల: వరికపూడి ప్రాజెక్టు నిర్మాణం కోసం మే 1 నుంచి 42 రోజుల పాటు దీక్ష చేపట్టనున్నట్లు జల సాధన సమితి ప్రధాన కార్యదర్శి పల్నాడు శ్రీను తెలిపారు. స్థానిక సిపిఐ కొమెర వీరాస్వామి భవన్‌లో ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షుడు బత్తుల వీరయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.పల్నాడు శ్రీను మాట్లాడుతూ, వరికపూడి ప్రాజెక్టు పల్నాటి ప్రజలకు దశాబ్దాలుగా నెరవేరని కలగా మిగిలిపోయిందన్నారు. పాలకులు మారినా ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు త్వరలో ప్రారంభిస్తామంటూ కాలం గడిపిన పాలకులు, ఇప్పుడు అనుమతులే రాలేదని చెప్పడం బాధాకరమన్నారు.అనుమతులు పూర్తిగా లేకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకుల ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.ప్రాజెక్టు పనులు ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అందులో భాగంగా మే 1 నుంచి…

Read More