
మాచర్ల నియోజకవర్గం, మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన బూసా థామస్ మాతృమూర్తి బూసా రంగమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నేత యనమల మురళీధర్ రెడ్డి గ్రామానికి చేరుకుని రంగమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
