
దోమల కాయిల్ దుర్ఘటన… కంటెపూడిలో వ్యక్తి సజీవ దహనం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో దోమల బెడదతో రాత్రి సమయంలో దోమల కాయిల్ (చక్రం) వెలిగించి నిద్రపోయిన నాగేశ్వరరావు, అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
దోమల కాయిల్ నుంచి వచ్చిన నిప్పురవ్వ దుప్పటికి అంటుకోవడంతో మంటలు వ్యాపించి నాగేశ్వరరావు సజీవ దహనమైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఈ మరణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి
