
ఈ సందర్భంగా 27 రికార్డులేని టూ వీలర్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల యజమానులు సరైన పత్రాలు సమర్పిస్తే తిరిగి ఇవ్వబడతాయని, లేనిపక్షంలో వాటిని దొంగ వాహనాలుగా పరిగణించి కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.
సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఇటీవలి కాలంలో సుమారు 50 కాటన్ సెర్చ్‌లు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా గొడవలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో యువతలో గంజాయి వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా విద్యార్థులు కూడా దీనికి బానిసలవుతున్నారని చెప్పారు. గంజాయి అలవాటు కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
గంజాయి, అక్రమ కార్యకలాపాలు, పేకాట శిబిరాలపై సమాచారం ఉంటే వెంటనే 112కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు.
