Author: myapnews9@gmail.com

పల్నాడు జిల్లా కారంపూడి శివారులోని పేటసన్నిగండ్ల గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.వివరాల ప్రకారం… కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన కోళ్ల ఫారం యజమాని బొలెరో మాక్స్ వాహనం అతివేగంతో నరసరావుపేట నుంచి కారంపూడి వైపు వస్తుండగా, పిడుగురాళ్ల గాంధీనగర్‌కు చెందిన మేకల శివాజీ, చెవుల యేసుదాసు మరో వ్యక్తితో కలిసి బైక్‌పై అడిగోప్పల శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్లి తిరిగి పిడుగురాళ్ల వైపు వెళ్తున్నారు.ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన బొలెరో మాక్స్ బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో శివాజీ, యేసుదాసు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రథమ చికిత్స కోసం నరసరావుపేటకు తరలించారు.అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.…

Read More

మాచర్ల: పల్నాడు ప్రజల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందిన మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన అభివృద్ధికి సంబంధించి రూ.5 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన ప్రణాళికలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నమూనాల పునర్నిర్మాణంపై దేవస్థాన అధికారులతో సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఆలయ పరిరక్షణతో పాటు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే, ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసి, భక్తుల రాకపోకలు పెరగడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, అమరావతి నిర్మాణం వంటి కార్యక్రమాలతో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.అలాగే, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని, నాయకుల పట్ల గౌరవాన్ని తెలియజేసే మంచి అవకాశం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల పట్టణంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాచర్ల అన్న క్యాంటిన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రజలకు ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు.జన్మదినోత్సవాన్ని సేవా దినోత్సవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం మూడు పూటలుగా ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. పట్టణ ప్రజలు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.అన్న క్యాంటిన్‌లో పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ భోజన పదార్థాలను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా పంపిణీ జరగేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉపశమనం కలగడమే కాకుండా, సామాజిక సేవా స్పూర్తి మరింత బలపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Read More

అగ్నిమాపక అధికారులకు సన్మానంమాచర్ల :అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ఆదివారం వాసవి క్లబ్ మాచర్ల చెన్నకేశవ నిర్వాహుకులు 12 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వాసవిక్లబ్ రీజియన్ చైర్మన్ ఓరుగంటి చెన్నకేశవరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ మాట్లాడుతూ అగ్నిమాపక అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి వాసవి క్లబ్ నిర్వాహుకులు సన్మానించటం అభినందనీయమన్నారు. ప్రమాదాలు చెప్పిరావని, ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకొని తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణ, ఆస్థిని కాపాడుతారని, వారి సేవలు వెలగట్టలేనివని పేర్కొన్నారు. అగ్నిమాపక ఇంచార్జి అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని పలు ఆపార్ట్ మెంట్లు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అగ్నిప్రమాదాలుపై అవగాహన కార్యక్రమాలు…

Read More

మాచర్ల: కృష్ణవేణి జూనియర్ కళాశాల మరియు ఎస్విఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి 100 మందికి పైగా ప్రజలు హాజరై తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పొందారు.ఈ శిబిరంలో కేరళకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య సంస్థ శ్రీధరీయం ఆయుర్వేదిక్ పంచకర్మ వైద్యులు డాక్టర్ దిలీపన్ మరియు వారి సిబ్బంది పాల్గొని, రోగుల సమస్యలను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందించారు.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరం ప్రజలకు ఉపయోగకరంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యనమదల వెంకట్రామయ్య, డైరెక్టర్లు సుబ్బారావు, శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతినెల నిర్వహించనున్నట్లు మేనేజర్ హుస్సేన్ తెలిపారు. మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్వాహకులు సూచించారు.

Read More

మాచర్ల మండలం: పల్నాడు ప్రాంత అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాళ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఐఆర్పీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్, ఇండియా ఎన్స్యూర్, అసిస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రూ.24 లక్షల వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్‌ను ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ లావు మాట్లాడుతూ, వెనుకబడిన పల్నాడు అభివృద్ధికి ఈ ప్రాంతంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన వారు దాతలుగా మారి తమ మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, తాగు మరియు సాగునీటి రంగాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మాచర్ల నియోజకవర్గానికి మౌళిక వసతులు, రోడ్లు, తాగు–సాగునీరు, యువతకు ఉపాధి వంటి అంశాల్లో రానున్న మూడేళ్లలో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న…

Read More

పల్నాడు జిల్లాలో ప్రతి గడపకు తాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆదివారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి ఎస్‌కేబీఆర్ కళాశాల క్రీడా మైదానం పక్కన రూ.25 కోట్లతో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయ స్థలాన్ని పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్ మ్యాప్‌ను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ లావు, మొదటి దశలో రూ.1200 కోట్ల వ్యయంతో సాగర్ శుద్ధ జలాలను మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక మిగతా ఐదు నియోజకవర్గాలకు జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత గల మూడు ప్రాజెక్టుల్లో వరికపూడిశెల ఒకటని, త్వరితగతిన అనుమతులు తీసుకుని పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలికంగా స్థానిక బాయ్స్ హై స్కూల్‌లో…

Read More

మాచర్ల: సామాజిక సేవా కార్యక్రమాల్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తమవంతు భాగస్వామ్యం చూపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు.ఆదివారం స్థానిక కేసీపీ రోడ్డులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పూర్తితో “మన మాచర్ల – మన బ్రహ్మారెడ్డి” పేరుతో టీడీపీ మైనారిటీ యువ నాయకుడు షేక్ మోసిన్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా చిరు వ్యాపారులకు 10 తోపుడు బండ్లను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి అర్హులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నిరుపేద వీధి వ్యాపారుల కోసం మోసిన్ అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నిరుపేద వీధి వ్యాపారుల కోసం మోసిన్ అందిస్తున్న సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More