మాచర్ల: పట్టణంలోని వైభవ్ రెసిడెన్సి అండ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు సుమారు రూ.75 వేల విలువైన ఏడు ట్రైసైకిళ్లను రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ ఎస్.వి. రాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు.దుర్గి మండలంలోని ముటుకూరు సమీప కొండ ప్రాంతంలో ఉన్న నెహ్రూ తండా ప్రజల సమస్యలను గుర్తించిన రోటరీ క్లబ్, వారికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు సుమారు రూ.2 లక్షల విలువైన ఆర్‌ఓ ప్లాంట్‌ను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ను జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు పంగులూరి కళ్యాణ్ సహకారంతో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ సీనియర్ రొటేరియన్ ఝాన్సీ ప్రేమానంద్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. రోటరీ క్లబ్బుల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. తాళ్లపల్లి పవర్…
Author: myapnews9@gmail.com
జన్మదిన వేడుకల సందర్భంగా మండలంలోని డ్వాక్రా యానిమేటర్లకు చీరలు పంపిణీ చేశారు. అలాగే కారంపూడిలోని వీర్ల అంకాలమ్మ దేవస్థానం, పేట సన్నెగండ్లలోని సింగరెట్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మునుగోటి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు చప్పిడి రాము, ఎం.పి.పి బోల్నేడి శ్రీనివాసరావు, కారంపూడి మండల అధ్యక్షులు గోళ్ళ సురేష్ యాదవ్, మాజీ మండల అధ్యక్షులు ఉన్నం లక్ష్మీనారాయణ, మాజీ కోఆప్షన్ సభ్యులు తండా మస్తాన్ జానీ, కారంపూడి పట్టణ మాజీ అధ్యక్షులు కటికల బాలకృష్ణ, చిరుమామిళ్ల శ్రీను, కోదాటి ప్రభాకర్, ఎస్పిఆర్ కృష్ణ, షేక్ నన్నేసా, కర్నాటి మహేష్, బాలు నాయక్ తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మాచర్ల నూర్ భాషా సంక్షేమ సంఘం సభ్యులు, పెద్దలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదినాలను జరుపుకోవాలని అల్లాను ప్రార్థించారు. నూర్ భాషా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆయన ప్రజాసేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన, ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బృంగా బ్రదర్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామ శివారులోని అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ నివాసితులకు భోజనం అందించి, వారితో కలిసి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బృంగా లింగయ్య, దుర్గి యార్డ్ చైర్మన్ లింగ బ్రహ్మయ్య, జానకిరామయ్య, మేకల దాసు, గాలి శ్రీను, కేళం ఆదినారాయణ, మాగులూరి నారయ్య, బృంగా రమణరావు, షేక్ సిలార్, ముత్తినేని పుల్లయ్య, కేళం రవి, బృంగా నరసింహరాజు, బృంగా నాగరాజు, పెరువల ఏసోబు, మాచర్ల మదర్, మంద కోటయ్య, మంద నాగేశ్వరావు, కేళం నారాయణ, భేరి నరసింహారావు, చిత్తులూరి రామారావు, బుసాని రాజయ్య, తిక్క పాపయ్య, మోసిన్, ముజఫర్, మైన, నాగూర్, జిలానీ, బృంగా వర్మ తదితరులు…
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ మోసిన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.రాయవరం జంక్షన్ వద్ద ఉన్న మదరసా పిల్లలకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే లింగాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పఠాన్ బద్రుద్దీన్, ముటుకూరు సుభాని, చింతపల్లి ముజఫర్, బట్టల మౌలాలి, టీ షరీఫ్, టోపీ సుభాని, అలీ, మార్బుల్ ఖలీల్, అబ్బాస్ షరీఫ్, ఖాసీం, స్టూడియో మస్తాన్, షన్వాజ్, రియాజ్, బుల్లెద్దుల శివ, స్టూడియో మస్తాన్ సందీప్, బ్రహ్మం ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరు గాంచిన, ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి జన్మదినం సందర్భంగా శనివారం మాచర్ల పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా లెపర్స్ కాలనీ నందు అన్నదానం కార్యక్రమం నిర్వహించడంతో పాటు కేక్ కటింగ్ చేసి, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎక్స్ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాచర్ల బాబు, గెల్లిపోగు మరియాదాసు, చింతమళ్ళ అడవిరాముడు, భీమవరపు శ్రీను, దొడ్డా చందు, నార్ల రాములు, డేగల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా కంభంపాడు గ్రామంలో భూముల రీ-సర్వే కార్యక్రమంపై గ్రామ సభ మరియు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ , మండల సర్వేయర్, స్పెషల్ ఆఫీసర్ & MPDO, గ్రామ సర్వేయర్లు, VRO, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు. భూముల రీ-సర్వే ప్రక్రియ, దాని ప్రయోజనాలు, భూమి హక్కుల స్పష్టత, రికార్డుల సరిదిద్దడం వంటి అంశాలపై అధికారుల ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.గ్రామంలో భూముల వివాదాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ రీ-సర్వే కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
పల్నాడు జిల్లా, నూజండ్ల:పల్నాడు జిల్లాలోని నూజండ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో శుక్రవారం అపూర్వ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల బాత్రూమ్‌లో భారీ కొండచిలువ కనిపించడంతో విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.వివరాల్లోకి వెళితే… ఒక విద్యార్థి టాయిలెట్‌కు వెళ్లేందుకు బాత్రూమ్ తలుపు తెరిచిన వెంటనే లోపల పెద్ద కొండచిలువను గమనించాడు. దీంతో అతను భయంతో కేకలు వేయగా, ఇతర విద్యార్థులు కూడా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.ఈ ఘటనతో కొంతసేపు పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, పాము పట్టుబడిన తర్వాత విద్యార్థులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.అయితే, పాఠశాల పరిసరాల్లో అడవి జంతువులు ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు.
పల్నాడు జిల్లా, కారంపూడి మండలం:పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసే దిశగా పోలీసులు చర్యలు మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో కారంపూడి మండలం పేట సన్నిగండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని పోతురాజు గుట్ట ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ తనిఖీలలో గురజాల డీఎస్పీ ఎం. మహేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐలు శరత్ బాబు, రాజేష్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలు, వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. అలాగే 14 ఆయుధాలను (వెపన్స్) గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల ఈ చర్యతో పోతురాజు గుట్ట పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలపై గట్టి చెక్ పడినట్లు…
రాష్ట్రంలో జరగబోయే పాలిసెట్ (POLYCET), ఏపీఆర్జేసీ (APRJC) ప్రవేశ పరీక్షల తేదీలలో మార్పు చేయాలని తల్లిదండ్రులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కోరారు.ఈ నెల 24న రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (APRJC) ప్రవేశ పరీక్ష, 25న పాలిటెక్నిక్ (POLYCET) పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.అయితే వరుసగా రెండు రోజులు పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల తేదీలలో మార్పు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
