
రాష్ట్రంలో జరగబోయే పాలిసెట్ (POLYCET), ఏపీఆర్జేసీ (APRJC) ప్రవేశ పరీక్షల తేదీలలో మార్పు చేయాలని తల్లిదండ్రులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కోరారు.
ఈ నెల 24న రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (APRJC) ప్రవేశ పరీక్ష, 25న పాలిటెక్నిక్ (POLYCET) పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అయితే వరుసగా రెండు రోజులు పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల తేదీలలో మార్పు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
