
మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరు గాంచిన, ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి జన్మదినం సందర్భంగా శనివారం మాచర్ల పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లెపర్స్ కాలనీ నందు అన్నదానం కార్యక్రమం నిర్వహించడంతో పాటు కేక్ కటింగ్ చేసి, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎక్స్ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాచర్ల బాబు, గెల్లిపోగు మరియాదాసు, చింతమళ్ళ అడవిరాముడు, భీమవరపు శ్రీను, దొడ్డా చందు, నార్ల రాములు, డేగల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
