
ఈ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పంగులూరి పుల్లయ్య, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు డీసీ-4 చైర్మన్ పంగులూరి అంజయ్యలు టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్న ప్రజానాయకుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
జన్మదిన వేడుకల సందర్భంగా మండలంలోని డ్వాక్రా యానిమేటర్లకు చీరలు పంపిణీ చేశారు. అలాగే కారంపూడిలోని వీర్ల అంకాలమ్మ దేవస్థానం, పేట సన్నెగండ్లలోని సింగరెట్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దుర్గి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మునుగోటి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు చప్పిడి రాము, ఎం.పి.పి బోల్నేడి శ్రీనివాసరావు, కారంపూడి మండల అధ్యక్షులు గోళ్ళ సురేష్ యాదవ్, మాజీ మండల అధ్యక్షులు ఉన్నం లక్ష్మీనారాయణ, మాజీ కోఆప్షన్ సభ్యులు తండా మస్తాన్ జానీ, కారంపూడి పట్టణ మాజీ అధ్యక్షులు కటికల బాలకృష్ణ, చిరుమామిళ్ల శ్రీను, కోదాటి ప్రభాకర్, ఎస్పిఆర్ కృష్ణ, షేక్ నన్నేసా, కర్నాటి మహేష్, బాలు నాయక్ తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
