Author: myapnews9@gmail.com

పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఎం.ఎస్.ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరై భూమి పూజ చేసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా పార్క్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందిస్తూ, ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…“ఎం.ఎస్.ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ స్థాపనతో మాచర్ల ప్రాంతానికి పరిశ్రమల వాతావరణం ఏర్పడుతుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ పార్క్ ద్వారా పెట్టుబడులు ఆకర్షితమవడంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ తరహా ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయి. యాజమాన్యం అన్ని ప్రమాణాలను పాటిస్తూ, పర్యావరణానికి హాని కలగకుండా పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్క్…

Read More

పల్నాడు జిల్లా మాచర్లలో పోలీస్ శాఖను కలవరపరిచే ఘటన వెలుగులోకి వచ్చింది. మాచర్లకు చెందిన ఏఎస్సై శ్రీనివాసరావుపై తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ప్రేమజంటల వీడియోలు గోప్యంగా చిత్రీకరించి, వాటిని చూపిస్తూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.అంతేకాకుండా, వీడియోలను ఆధారంగా తీసుకుని మహిళలను వేధిస్తూ, అనుచిత కోరికలు కోరుతున్నాడనే ఆరోపణలు కూడా బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, విచారణ అనంతరం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఏఎస్సై శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పోలీసులు ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 23వ వార్డులో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరై, కమిటీ సభ్యులతో పదవీ బాధ్యతల ప్రమాణం చేయించారు.అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో భాగంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…“దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడం, ఆలయ పరిపాలనను పారదర్శకంగా నిర్వహించడం నూతన కమిటీ ప్రధాన బాధ్యత. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలి.శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. సేవా భావంతో పని చేస్తే ఆలయ అభివృద్ధి మాత్రమే కాకుండా సమాజానికి కూడా…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్‌లో సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొని, పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…“మహాత్మ జ్యోతిరావు పూలే గారు సమాజంలో అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు. ఆయన విద్యా విప్లవానికి నాంది పలికి, మహిళల విద్యకు, సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడిగా నిలిచారు. కుల వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజంలో మార్పు తీసుకువచ్చిన గొప్ప సంస్కర్త. ప్రతి ఒక్కరూ పూలే గారి ఆశయాలను ఆచరణలో పెట్టుకోవాలి. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం ఆయన చూపిన మార్గం. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. పూలే గారి ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో…

Read More

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసిన మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ పఠాన్ నాగూర్ వలి తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పిన్నంశెట్టి మహాలక్ష్మి 532 మార్కులతో ప్రథమ స్థానాన్ని, 519 మార్కులతో షేక్ అమీషా ద్వితీయ స్థానాన్ని సాధించారు. బీకాం కంప్యూటర్ విభాగంలో షేక్ బషీర్ ప్రథమ స్థానం, ఉమ్మిడి భూమిక ద్వితీయ స్థానం పొందారు. బీఎస్సీ బి.జెడ్.సి విభాగంలో వీరంకి భువనేశ్వర్, బీఏ విభాగంలో నాగిరెడ్డి లక్ష్మీప్రసన్నలు ప్రథమ స్థానాల్లో నిలిచారు.కళాశాల చైర్మన్ మారేపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు మంచి మార్కులతో పాటు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మర్రి వెంకటనారాయణ, షేక్ మస్తాన్ వలి, ఆంజనేయ శాస్త్రి, అధ్యాపకులు సునీల్ కుమార్, సయ్యద్…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రామాటాకీస్ వీధిలో నివసిస్తున్న షేక్ చిన్న సైదా తన ఇంట్లో టిఫిన్ తయారు చేస్తుండగా, అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో సైదా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆయన్ని చికిత్స కోసం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More

మాచర్ల పట్టణంలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు నామాల శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.బాధిత యువతికి నిందితుడు ప్రియుడు కావడం ఈ కేసులో కొత్త ట్విస్ట్‌గా మారింది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, రాజుపాలెం ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితుడిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం నిందితుడిని గురజాల సబ్ జైలుకు తరలించారు. ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు

Read More

పల్నాడు జిల్లా రాయవరం గ్రామంలో నాగార్జునసాగర్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కింద త్రాగునీటి సరఫరా కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించిన స్థల పరిశీలన చేపట్టారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దారు, ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) అధికారులు, గ్రామ సర్వేయర్, వీఆర్వో తదితరులు గ్రామంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత రెవెన్యూ రికార్డులను కూడా అధికారులు పరిశీలించారు.పరిశీలన అనంతరం పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

Read More

మీడియా సంస్థలపై రౌడీ మూకలతో కలిసి దాడులకు పాల్పడటం తీవ్రంగా ఖండించదగిన చర్య అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యాగంటి మల్లికార్జునరావు పేర్కొన్నారు. ప్రజా గళాన్ని ప్రతిబింబించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని అమరావతి అంశంపై జగన్ రెడ్డి వైఖరిని ప్రశ్నించినందుకే మీడియా సంస్థపై భౌతిక దాడులకు దిగడం అప్రజాస్వామికమని యాగంటి విమర్శించారు. మాజీ మంత్రులు సైతం రౌడీ మూకలతో కలిసి ఈ దాడిలో పాల్గొనడం అత్యంత దుర్మార్గమని అన్నారు.ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులకు దిగడం వైసీపీ పార్టీ నైజమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు స్థానం లేదని స్పష్టం చేశారు. “ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే నిప్పుకణిక. వాటిని అణచివేయాలని ప్రయత్నించడం అవివేకం” అని యాగంటి పేర్కొన్నారు.జగన్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే, అలాగే సొంత పార్టీలో ఎదురవుతున్న వ్యతిరేకతను దాచిపెట్టడానికే మీడియాపై…

Read More