Author: myapnews9@gmail.com

మాచర్ల మండలం రాయవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు.అమ్మవారిని వైభవంగా అలంకరించగా ఆలయం భక్తుల సందడి తో కిటకిటలాడింది. కార్యక్రమంలో భాగంగా సంప్రదాయబద్ధంగా కుంకుమ బండ్లకు పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. ఈ తిరునాళ్ల సందర్భంగా పలు ధార్మిక కార్యక్రమాలు, ప్రత్యేక సేవలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన కామనబోయిన చౌడమ్మ అనుమానాస్పద మృతి కేసు హత్యగా మారింది. మొదట ఉరివేసుకుని ఆత్మహత్యగా భావించిన ఈ ఘటన, పోస్టుమార్టం నివేదికతో అసలు నిజం బయటపడింది.మాచర్ల పట్టణం 22వ వార్డుకు చెందిన చౌడమ్మ (23) మృతి కేసును మార్చి 18, 2026న Cr.No.27/2026 కింద BNSS సెక్షన్ 194 ప్రకారం నమోదు చేసిన పోలీసులు, ఏప్రిల్ 5న దాన్ని BNS సెక్షన్ 103(1) కింద హత్య కేసుగా మార్పు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించగా, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి తండ్రి కామనబోయిన చంద్రశ్రీను, అతని మేనల్లుడు పచ్చిపాల శ్రీను కలిసి చౌడమ్మను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రేమ వివాహమే ఈ దారుణానికి కారణమని తెలిసింది. కుటుంబ సభ్యులను ఎదిరించి జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజును ప్రేమించి పెళ్లి…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హృదయాలను కదిలించే ఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి, తన ఆరోగ్యం బాగుపడితే మళ్లీ స్కూల్‌కు వెళ్తానని అమాయకంగా చేసిన వేడుకోలు అక్కడున్న వారిని కన్నీళ్లు పెట్టించింది.తమ బిడ్డను అందరిలాగే చదివించి, మంచి స్థాయికి తీసుకెళ్లాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు, ఒక్కసారిగా వచ్చిన వ్యాధి పెద్ద దెబ్బగా మారింది. బిడ్డను కాపాడుకోవాలన్న ఆత్రుతతో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను వేడుకుంటూ “నన్ను బతికించండి… నేను స్కూల్‌కి వెళ్తాను” అంటూ చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ప్రజలు తీవ్రంగా కదిలిపోయారు.పసిప్రాణం కోసం పోరాడుతున్న ఈ కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని, ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు స్పందించి ఆ చిన్నారికి ప్రాణ భిక్ష పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ హృదయ…

Read More

మాచర్ల పట్టణంలోని రామాటాకీస్ వీధిలోని డాక్టర్స్ బజార్‌లో డి.ఎన్.ఆర్. అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ క్లినిక్‌ను ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభించారు. సీనియర్ రొటేరియన్, ప్రముఖ దంత వైద్యులు సిద్ధబత్తుని మురహరి రావు ఈ క్లినిక్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా అసోసియేటెడ్ ప్రొఫెసర్, పెయిన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ డాక్టర్ దుబ్బ నాగరాజు మాట్లాడుతూ, ఈ క్లినిక్‌లో గవర్నమెంట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్స్‌కు ఉచిత కన్సల్టెన్సీ అందించనున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన నిపుణుల చేత మాత్రమే వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.ఇక్కడ న్యూరాలజీ, ఉమెన్ హెల్త్, ఆర్థోపెడిక్స్, వృద్ధాప్య సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, ఫిట్‌నెస్ ట్రైనింగ్ వంటి విభాగాల్లో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జి. ప్రత్యూష మాట్లాడుతూ, క్లినిక్‌కు రాలేని రోగులకు ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించే సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోటరీ ఎలెక్ట్ ప్రెసిడెంట్ పఠాన్…

Read More

మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటనపై సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా, వాటి అమలు మాత్రం సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. పట్టపగలే ఇళ్లలోకి చొరబడి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతుండటం చట్టవ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు.ఈ ఘటనలో నిందితుడు అత్యంత పాశవికంగా ప్రవర్తించి కూడా ఎలాంటి భయంలేకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడితే ఎంత బలమైన చట్టాలున్నా ప్రయోజనం ఉండదని, మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలే దీనికి నిదర్శనమన్నారు.చిన్నపాటి వివాదాలకే పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సామాన్యులకు కూడా ముడుపులు లేకుండా న్యాయం జరగని…

Read More

మాచర్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దేవస్థానం కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాటి ప్రజల కొంగుబంగారంగా నిలిచిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం తిరుణాళ్లు ఎంతో విశిష్టమైనవని పేర్కొన్నారు. ఈ పవిత్ర సందర్భంలో స్వామివారిని దర్శించుకోవడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజలు సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో, ధనధాన్యాలతో సంతోషంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు,…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జమ్మలమడక రోడ్డులో ఉన్న చంద్రవంక బ్రిడ్జి వద్ద “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాగు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టి, అధికారులతో కలిసి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు సాగునీటి వనరుల సంరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. రైతు సంఘాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాలని సూచిస్తూ అవగాహన కల్పించారు.చంద్రవంక వాగులో పూడికతీత పనులు, సైడ్ వాల్స్ నిర్మాణం, బ్రిడ్జి అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి, వాటి అంచనాలను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. మంజూరైన నిధులను సమర్థంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చంద్రవంక వాగులో పూడికతీత పనులు, సైడ్ వాల్స్ నిర్మాణం, బ్రిడ్జి అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి, వాటి అంచనాలను…

Read More

మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పుడా చైర్మన్ చిరుమామిళ్ల మధుబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుడా చైర్మన్ చిరుమామిళ్ల మధుబాబు మాట్లాడుతూ, ఈస్టర్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైనది అని తెలిపారు. యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా ప్రేమ, క్షమ, త్యాగం వంటి గొప్ప విలువలను ప్రపంచానికి తెలియజేశారని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ ఈ విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు.ప్రస్తుతం సమాజంలో పరస్పర గౌరవం, ఐక్యత ఎంతో అవసరమని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించాలన్నారు. ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.

Read More

పల్నాడు జిల్లా దాచేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. భాస్కర్‌పై వచ్చిన ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులు విస్తృత స్థాయిలో విచారణ చేపట్టారు.దాచేపల్లి, గురజాల మండలాల్లో నిర్వహించిన ఈ విచారణకు ప్రాధాన్యత నెలకొంది. ఇటీవల సీఐ పి. భాస్కర్‌ను వీఆర్‌కు పంపిన నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతోంది.విచారణలో భాగంగా సంబంధిత వ్యక్తులను పిలిపించి వివరాలు సేకరించిన అధికారులు, స్థానికంగా వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా కలిసి వారి వాదనలు విన్నారు.ప్రత్యేక అధికారులు ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి కోణాన్ని పరిశీలిస్తూ నిజానిజాలు వెలికితీసే దిశగా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.విచారణ అనంతరం పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

Read More

మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆయన విగ్రహానికి బీజేపీ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్, కోపరేటివ్ కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్రావు, నియోజకవర్గ సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏచూరి అమర సురేష్, పట్టణ ఉపాధ్యక్షులు మారం వంశీకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షుడు మరియు వికసిత్ భారత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ శివకోటయ్య నాయక్, పట్టణ యువమోర్చా నాయకులు జెట్టిపల్లి గణపతి తదితరులు పాల్గొన్నారు.

Read More