మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల కాలం ముగియడంతో పట్టణ పాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గురజాల ఆర్డీవో మురళిని మాచర్ల మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించడంతో పట్టణ అభివృద్ధిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.ఈరోజు మాచర్ల మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన స్పెషల్ ఆఫీసర్ మురళిని మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్, కమిషనర్ డి. వేణుబాబు, డాక్టర్ అఫ్జల్ బాషా తదితరులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పట్టణ అభివృద్ధికి సమన్వయంతో పని చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించిన మురళి, పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా పారదర్శకంగా పాలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Author: myapnews9@gmail.com
పల్నాడు జిల్లా మాచర్ల నుండి జమ్మలమడకకు వెళ్లే మార్గంలో కనిపించే ఒక అద్భుత నిర్మాణం “బొంబాయి కంపెనీ బ్రిడ్జ్”. పేరే ప్రత్యేకతను చెప్పేస్తుంది. ఈ బ్రిడ్జ్‌ను బొంబాయి కి చెందిన ఓ నిర్మాణ సంస్థ నిర్మించిందని స్థానికులు చెబుతారు. అప్పటి కాలంలో ఉన్న ఇంజనీరింగ్ ప్రతిభకు ఇది ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.సాగర్ కుడి కాల్వ నీటిని వదిలినప్పుడు ఈ బ్రిడ్జ్ మీదుగా నీరు ప్రవహించడం ఒక ప్రత్యేక ఆకర్షణ. సాధారణంగా వంతెనలు నీటికి పైగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం నీరు వంతెనపై నుంచి పారుతుండటం చూసే వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ప్రకృతి, ఇంజనీరింగ్ కలయికగా నిలిచే అరుదైన దృశ్యం. ఈ బ్రిడ్జ్ కింద నుంచి జమ్మలమడకకు వెళ్లే మార్గం ఉంది. పైభాగంలో నీరు ఉండటంతో, వేసవి కాలంలో కూడా ఈ బ్రిడ్జ్ కింద అతి చల్లని వాతావరణం ఏర్పడుతుంది. దీంతో స్థానికులు, ప్రయాణికులు ఇక్కడ కొంతసేపు విశ్రాంతి…
ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలిస్తూ రోగులకు అందుతున్న వైద్య సేవలపై నేరుగా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహణలో లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.🩺 మందుల కొరతపై వైద్యులకు క్లాస్ఆసుపత్రిలో అత్యవసర మందుల కొరత ఉండటం, రోగులకు బయట మెడికల్ షాపుల్లో మందులు రాయడంపై కలెక్టర్ వైద్యులను నిలదీశారు. “మందుల కొరత ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. అవసరమైన మందులు తెలియజేస్తే ప్రభుత్వం అందిస్తుంది. సమస్యలను చెప్పకుండా రోగులను ఇబ్బంది పెట్టడం సరికాదు” అని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు వివరణ కోరారు. ల్యాబ్ సేవలపై అసంతృప్తిబ్లడ్ శాంపిల్స్ సేకరణ, రిపోర్టుల జాప్యం పై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద రోగులకు సకాలంలో రిపోర్టులు అందకపోతే ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని…
పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై అదే గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.శనివారం రాత్రి బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతికే క్రమంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ, నిందితుడు సతీష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు సభ్య సమాజానికి మచ్చగా నిలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.బాలికకు న్యాయం జరిగేలా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
గుంటూరు గ్రామీణ పరిధిలోని దాసరి పాలెంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసును ప్రత్తిపాడు పోలీసులు వేగంగా ఛేదించారు. భర్తను హత్య చేసి శవాన్ని గోనె సంచిలో పెట్టి చెరువులో పడవేసిన ఘటనలో భార్యతో పాటు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించి 19-03-2026న ఈదులపాలెం వద్ద జాతీయ రహదారి పక్కన చెరువులో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి తాడుతో రాయి కట్టి నీటిలో పడవేసినట్లు గుర్తించారు. సంఘటనా స్థలంలో మిరప గోనె సంచి కూడా లభ్యమైంది.దర్యాప్తులో భాగంగా మృతుడు తన్నీరు వెంకటేశ్వర్లు (30), పొన్నూరు మండలం వాసి, ప్రస్తుతం దాసరిపాలెంలో నివసిస్తున్నట్లు గుర్తించారు. అతను మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకుని తరచూ వేధింపులకు గురిచేసేవాడని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో మార్చి 17న ఇంట్లో జరిగిన ఘర్షణలో ఉప్పుతల్ల లక్ష్మి @ తిరుపతమ్మ (భార్య), సిద్ధి సురేష్, సిద్ధి…
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల ప్రధాన రహదారుల వెంట కొందరు యువకులు అత్యంత ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల సహాయంతో వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొందరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మరికొందరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పి హనుమంతరావు హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
నకరికల్లులో గ్యాస్ వినియోగదారులు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఆన్లైన్ బుకింగ్లో సర్వర్ సమస్యల కారణంగా గ్యాస్ సిలిండర్లు సమయానికి అందడం లేదని వాపోతూ, ఖాళీ సిలిండర్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే సాంకేతిక లోపాలను పరిష్కరించి సరఫరాను క్రమబద్ధీకరించాలని వినియోగదారులు డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూటమి కేసులో అరెస్టై, అనంతరం బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు శ్రీ పూనూరు గౌతమ్ రెడ్డి మరియు గురజాల నియోజకవర్గం పరిశీలకులు పడాల శివారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పిన్నెల్లికి సంఘీభావం వ్యక్తం చేసిన వారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారంపూడి మండల మైనారిటీ నాయకుడు షేక్ మస్తాన్ నూతనంగా కొనుగోలు చేసిన బులెట్ వాహనాన్ని సోమవారం మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణరెడ్డి ప్రారంభించారు.మాచర్లలోని పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మస్తాన్ తన కొత్త వాహనాన్ని పిన్నెల్లి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. అనంతరం పిన్నెల్లి కొద్దిదూరం వాహనాన్ని నడిపి మస్తాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కారంపూడి వైసీపీ నాయకులు దర్గా సుభాని, గోగుల ప్రసాద్, బచ్చు గురుసైదారావు, వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో అరెస్టై, అనంతరం బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పిన్నెల్లికి తమ సంఘీభావాన్ని తెలియజేసిన కాసు మహేష్ రెడ్డి, రాజకీయ కక్షసాధింపుల నేపథ్యంలో కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గం పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు, గురజాల నియోజకవర్గం పరిశీలకులు పడాల శివారెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే గురజాల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
