
మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన, ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బృంగా బ్రదర్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామ శివారులోని అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ నివాసితులకు భోజనం అందించి, వారితో కలిసి జన్మదినాన్ని జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో బృంగా లింగయ్య, దుర్గి యార్డ్ చైర్మన్ లింగ బ్రహ్మయ్య, జానకిరామయ్య, మేకల దాసు, గాలి శ్రీను, కేళం ఆదినారాయణ, మాగులూరి నారయ్య, బృంగా రమణరావు, షేక్ సిలార్, ముత్తినేని పుల్లయ్య, కేళం రవి, బృంగా నరసింహరాజు, బృంగా నాగరాజు, పెరువల ఏసోబు, మాచర్ల మదర్, మంద కోటయ్య, మంద నాగేశ్వరావు, కేళం నారాయణ, భేరి నరసింహారావు, చిత్తులూరి రామారావు, బుసాని రాజయ్య, తిక్క పాపయ్య, మోసిన్, ముజఫర్, మైన, నాగూర్, జిలానీ, బృంగా వర్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
