Author: myapnews9@gmail.com

పలనాడు పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు మాచర్ల నియోజకవర్గ స్థాయిలో పాలిటెక్నిక్ మోడల్ ఎంట్రన్స్ పరీక్షను వికాస్ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 170 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఈ పరీక్షలో సి.హెచ్. వరుణ్ 93 మార్కులతో ప్రథమ స్థానాన్ని సాధించారు. ఆయనకు స్థానిక న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ జున్నా శ్రీనివాసరెడ్డి ప్రకటించిన రూ. 8116 నగదు బహుమతిని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నరసింహారావు, లక్ష్మయ్యల చేతుల మీదుగా అందజేశారు.జె. చరణ్ తేజ 87 మార్కులతో ద్వితీయ స్థానాన్ని పొందగా, వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తరఫున వై. కొండయ్య రూ. 5116 బహుమతిని అందజేశారు.పి. మహేంద్ర 85 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించగా, శ్రీ విష్ణు జూనియర్ కాలేజ్ తరఫున రూ. 3116 నగదు బహుమతిని కళాశాల డైరెక్టర్ మనోజ్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా పలనాడు ప్రతిభ జూనియర్ కళాశాలల సెక్రటరీ &…

Read More

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు విధాని ధర్ దాస్ (46) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఉపాధి కోసం ఒడిశా నుంచి గణపవరం వచ్చిన ఆయన, కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

పల్నాడు జిల్లా – చిలకలూరిపేట :చిలకలూరిపేట మండలం బొప్పూడి చెంచు కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోతముక్క ఆడుతున్నారన్న సమాచారం అందడంతో ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.31,500 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ, మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజల సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గత పాలనలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితుల వల్ల గ్రామాల్లో భూ సమస్యలు ఎక్కువయ్యాయని అన్నారు. భూ సర్వే సమయంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా ఎమ్మార్వో లేదా ఆర్డీఓలను సంప్రదించాలని సూచించారు. ఇంకా పరిష్కారం కాని అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Read More

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఆయన మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు.

Read More

నకరికల్లు మండలం గుండ్లపల్లికి చెందిన దివ్యాంగుడు అల్లానబి, బ్యాక్‌లాగ్ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో 5వ తరగతి మార్కుల జాబితా అవసరమైంది.ఈ నేపథ్యంలో తాను చదివిన పాఠశాల సంబంధిత అధికారిని సంప్రదించగా, సర్టిఫికెట్ జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. లంచం ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని చెప్పడంతో నిరాశ చెందిన ఆయన, మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.

Read More

కారంపూడి పట్టణంలోని భవిత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని బాధరబోయిన నాగలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.ఈ విషాద సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మానవత్వాన్ని చాటుకుంటూ నాగలక్ష్మి కుటుంబానికి అండగా నిలిచారు. రెండు నెలలకు సరిపడా బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను సమీకరించి అందజేశారు. ఈ సహాయాన్ని ఎంఈఓ-1 అనిల్ కుమార్, ఎంఈఓ-2 రవికుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల (మెయిన్) ప్రధానోపాధ్యాయురాలు పుల్లమ్మ, ఉర్దూ ఉన్నత పాఠశాల హెచ్ఎం బిక్షమయ్య, భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు మాధవి, ఉపాధ్యాయులు మల్లికార్జున, రాధాకృష్ణమూర్తి, మాన్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పలు పాఠశాలల సిబ్బంది కలిసి సరుకులను సమీకరించి అందించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, కష్టకాలంలో ఉపాధ్యాయులు ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. చిన్నారి…

Read More

మాచర్ల టౌన్ 8వ వార్డు రోప్ లైన్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొన్నేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి, భారీగా డబ్బులు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల తన తల్లి బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు రూ.3 లక్షలను కూడా బెట్టింగ్‌లలో ఖర్చు చేసినట్లు తెలిసింది తల్లి మల్లేశ్వరి మరో కుమారుడితో కలిసి బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేకపోవడం గమనించారు. ఈ విషయంపై చిన్న కుమారుడిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో వంశీని తల్లి నిలదీయగా, అతను రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు మాచర్ల పోలీసులను ఆశ్రయించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read More

ఈ తనిఖీలలో మాచర్ల తహశీల్దారు, గురజాల డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, మాచర్ల మండల సర్వేయర్, విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, తాళ్ళపల్లి గ్రామ సర్వేయర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోక్సో (POCSO) కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు.సంబంధిత నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Read More