
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోక్సో (POCSO) కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు.
సంబంధిత నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
