
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో కుటుంబ వివాదం తీవ్రరూపం దాల్చి దాడికి దారితీసింది. పట్టణంలోని సంజయ్ గాంధీ నగర్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో గౌతమ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం ప్రకారం, గౌతమ్‌కు తన భార్యతో పాటు అత్తామామలతో కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన వాగ్వాదం క్రమంగా హింసాత్మకంగా మారి, భార్యతో కలిసి అత్తామామలు గౌతమ్‌పై రోకలి బండతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
దాడిలో గాయపడిన గౌతమ్‌ను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై బాధితుడు గౌతమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
