మాచర్ల పట్టణంలో నిన్న చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి బాధితురాలి నివాసానికి క్లూజ్ టీం చేరుకుని కీలక ఆధారాలను సేకరిస్తోంది.ఈ సందర్భంగా వేలిముద్రలు సహా ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించి పరిశీలనకు పంపిస్తున్నారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు జిల్లా అదనపు ఎస్పీ స్థాయి అధికారిని మాచర్లలోనే మకాం పెట్టించి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనలో తెలిసిన వ్యక్తుల ప్రమేయమా, లేక బయటి వ్యక్తులా అన్న కోణాల్లో పోలీసులు అన్ని అవకాశాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Author: myapnews9@gmail.com
రోడ్డు ప్రమాదంలో కాబోయే వధూవరుల దుర్మరణందుర్గి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. త్వరలో వివాహ బంధంతో ఒక్కటవ్వాల్సిన యువ జంట రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.గుంటూరు పట్టణానికి చెందిన నేలపాటి సందీప్ (21), సోఫియా (20) కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉండగా, ఇరు కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించాయి. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.గుడ్ ఫ్రైడే సందర్భంగా సందీప్ యేసుక్రీస్తు మాల వేసుకున్నాడు. మాల విరమించేందుకు సోఫియాతో కలిసి ద్విచక్ర వాహనంపై విజయపురి సౌత్‌లోని సాగర్‌మాత చర్చికి వెళ్లారు. అక్కడ ప్రార్థనలు చేసి, నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలని దేవుని ప్రార్థించారు. అనంతరం సాగర్, ఎత్తిపోతల ప్రాంతాలను వీక్షించి గుంటూరుకు తిరుగు ప్రయాణం ప్రారంభించారు.ఈ క్రమంలో దుర్గి మండలం ఓబులేశునిపల్లె గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను గుర్తించలేక ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి…
లోక్‌సభలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడం ఐదు కోట్ల ఆంధ్రుల విజయంగా భావిస్తున్నామని టీడీపీ నాయకుడు యాగంటి మల్లికార్జునరావు అన్నారు. అమరావతి ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అని, ప్రజా రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.అమరావతికి పూర్తి స్థాయిలో న్యాయం చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు. ఈ బిల్లుతో ఇకపై అమరావతిని ఎవరూ మార్చలేరని, మూడు రాజధానుల అంశంపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇక రాజకీయాలు చేయలేరని విమర్శించారు.రాష్ట్ర విభజన సమయంలో అమరావతికి మద్దతు తెలిపిన వైఎస్ జగన్, 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని, ఏ ప్రాంతానికీ న్యాయం జరగలేదని అన్నారు.అమరావతి నిర్మాణం కోసం రైతులు సుమారు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన ఘనత ప్రపంచంలో అరుదైనదని తెలిపారు. మూడు రాజధానుల ప్రకటనతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారని…
మాచర్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈరోజు ఉపాధిహామీ సిబ్బందితో ఎంపిడిఓ శ్రీ ఆర్. ఫణి కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో 01.04.2026 నుండి ఉపాధిహామీ (వీబీ జి రామ్ జి) పనులను ప్రారంభించాలని ఆదేశించారు.రేపటి నుండి అన్ని గ్రామాలలో పండగ వాతావరణంలో పనులను ప్రారంభించి, శ్రామికులు పెద్దఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశాల్లో శ్రామికులకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు.శ్రామికుల హాజరు ఫేస్ ఆథెంటికేషన్ (ఆధార్ ఆధారిత) విధానంలో నమోదు చేయబడుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఏపీఓ నాగ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో మేట్లను నియమించాలని, శ్రామికులు అందరూ విధిగా పనులకు హాజరుకావాలని కోరారు.
మాచర్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలను సన్మానించారు. మండలంలో మొత్తం 200 కుటుంబాలు 100 రోజుల పనిని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా కంభంపాడు గ్రామానికి చెందిన ఎల్లాపి వెంకటేశ్వర్లు గారిని ఎంపిడిఓ ఫణి కుమార్ శాలువాతో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా మండలంలోని అన్ని శ్రామికులు 100 రోజుల పనిని పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వీబీ జి రామ్ జి పథకం కింద 125 రోజుల వరకు పనిని వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ వెంకయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సెర్చ్ సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను, కొన్ని మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో వివాదాలకు తావు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాలని సూచించారు. గ్రామాల్లో నేరాలను పూర్తిగా అరికట్టాలని, డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.అలాగే గ్రామాల్లో ఏవైనా అనుమానాస్పద లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమం కారంపూడి సర్కిల్ సీఐ శరత్, ఎస్సై వాసు పర్యవేక్షణలో 42 మంది సిబ్బందితో నిర్వహించినట్లు తెలిపారు.
గన్నవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగాస్వామివారికి నూతన పల్లకి బహుకరణమాచర్ల మండలం గన్నవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కిన పున్నయ్య కుమారులు స్వామివారికి నూతన పల్లకిని భక్తి భావంతో బహుకరించారు.అనంతరం దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తి పారవశ్యం కనిపించింది.
రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గ అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కులవృత్తిని ప్రోత్సహిస్తూ, ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వ ఆధీనంలోని కొండ పోరంబోకు భూముల్లో వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించాలని ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషంగా మారింది.పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని పలుచోట్ల వడ్డెర సామాజికవర్గానికి చెందిన ప్రజలు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. తమ సంప్రదాయ వృత్తి అయిన రాళ్లు కొట్టడం, మట్టి పనులు చేసుకునేందుకు ప్రభుత్వ భూముల్లో మైనింగ్ లీజులు కల్పిస్తే జీవనోపాధి మెరుగుపడుతుందని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన లోకేశ్, అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం, తాజా కేబినెట్ సమావేశంలో ఈ…
దాచేపల్లి: విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను సకాలంలో చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. ఏడీఈ వీరేశ్వరరావు, ఏఏఓ సందీప్ కుమార్, జేఏఓ ఆశీర్వాదం, ఏఈలు భగవాన్, నాగేశ్వరరావు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, అలాగే శ్రీరామనవమి పండుగ, చివరి ఆదివారం వంటి సెలవులు ఉండటంతో కార్యాలయాలు మూసివుండే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే కార్యాలయానికి వచ్చి విద్యుత్ బిల్లులు చెల్లించాలని సూచించారు.
మాచర్ల: యువగళం పాదయాత్ర సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం, వడ్డెర సమాజానికి మైనింగ్ రంగంలో 15% రిజర్వేషన్లు అమలు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు మాట్లాడుతూ, వడ్డెరల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షుడు కొమెర దుర్గారావు పాల్గొన్నారు.
