Author: myapnews9@gmail.com

నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాల్లో పలనాడు ప్రాంతానికి చెందిన ఈ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పట్టణ స్థాయిలో అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. అన్ని గ్రూపుల్లోనూ మొదటి, రెండవ, తృతీయ స్థానాలను సాధించడం ద్వారా కళాశాల ప్రతిష్టను మరింత పెంచారని కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ పఠాన్ నాగూర్ వలి తెలిపారు.సీనియర్ ఇంటర్ MPC విభాగంలో తిర్లికా విశ్వ చైతన్య 984 మార్కులతో పట్టణ టాపర్‌గా నిలవగా, అట్లూరి శ్రీలక్ష్మి 983 మార్కులతో రెండవ స్థానం, రాచమడుగు లక్ష్మీ సుహశ్రీ 981 మార్కులతో మూడవ స్థానం సాధించారు. మొత్తం 45 మంది విద్యార్థులు 900కి పైగా మార్కులు సాధించగా, 36 మంది విద్యార్థులు గ్రూప్ సబ్జెక్టుల్లో 100% మార్కులు పొందడం విశేషం. జూనియర్ MPC విభాగంలో తెలపాటి మధు గణేష్ 463 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, షేక్ రోషిని 462 మార్కులతో రెండవ…

Read More

సమ సమాజ స్థాపనకు కృషి చేసిన భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నేత ఎనుమల కేశవరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎనుమల కేశవరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి భారత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకర్తగా ఆయన దేశానికి అందించిన మార్గదర్శకత్వం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాన హక్కులు, సమ సమాజ నిర్మాణం…

Read More

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తేనే రైతాంగం ప్రగతి సాధిస్తుందని టిడిపి యువ నాయకుడు గౌతమ్ జూలకంటి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పల్లె సృజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో “వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు” పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గౌతమ్ జూలకంటి వ్యవసాయంలో వినియోగించే అధునాతన పరికరాలను పరిశీలించారు. తక్కువ ఖర్చుతో సులభంగా తయారు చేసిన యంత్రాల పనితీరును పరిశోధకులను అడిగి తెలుసుకున్నారు.చిన్న వయసులోనే విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి జగదీశ్వర్ రెడ్డి, మాచర్ల మండల వ్యవసాయ అధికారి పాపకుమారి, పాఠశాల నిర్వాహకులు కృష్ణారెడ్డి, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం విత్తన చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల విత్తన డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ వి. జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ, విత్తన డీలర్లు అందరూ విత్తన చట్టానికి లోబడి వ్యాపారం నిర్వహించాలని సూచించారు. ప్రతి డీలర్ తమ దుకాణాల్లో అమ్మకాలు చేసే విత్తనాలకు సంబంధించిన ఫారం-సి, పి.సి పత్రాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.అనుమతి లేని హెచ్.టి. (HT) ప్రత్తి విత్తనాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, షాపులో ఉన్న విత్తనాల స్టాక్ మరియు ధరలను డిస్ప్లే బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐదు మండలాల వ్యవసాయ అధికారులు డి. పాపకుమారి, టి. బాలాజీ గంగాధర్, వై. అమీర్ రెడ్డి, కె.…

Read More

మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న వరుస పరిణామాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే వివాదాల్లో చిక్కుకోవడం, పైస్థాయి అధికారుల వరుస చర్యలు పరిస్థితిని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి.మాచర్ల పట్టణానికి చెందిన చౌడేశ్వరి మృతి కేసు వివాదంలో సిఐ వెంకటరమణ సస్పెన్షన్‌కు గురైన ఘటన ఇంకా చర్చల మధ్యలోనే ఉండగా, వారం రోజులు గడవకముందే మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏఎస్ఐ శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడటం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. అదే సమయంలో ఎస్‌బి కానిస్టేబుల్ బదిలీ కూడా జరగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.గత పది రోజులుగా మాచర్ల పోలీస్ స్టేషన్ పేరు వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంచాల్సిన వ్యవస్థలోనే ఇలాంటి వివాదాలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఒకదాని వెంట ఒకటి…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఎం.ఎస్.ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరై భూమి పూజ చేసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా పార్క్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందిస్తూ, ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…“ఎం.ఎస్.ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ స్థాపనతో మాచర్ల ప్రాంతానికి పరిశ్రమల వాతావరణం ఏర్పడుతుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ పార్క్ ద్వారా పెట్టుబడులు ఆకర్షితమవడంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ తరహా ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయి. యాజమాన్యం అన్ని ప్రమాణాలను పాటిస్తూ, పర్యావరణానికి హాని కలగకుండా పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్క్…

Read More

పల్నాడు జిల్లా మాచర్లలో పోలీస్ శాఖను కలవరపరిచే ఘటన వెలుగులోకి వచ్చింది. మాచర్లకు చెందిన ఏఎస్సై శ్రీనివాసరావుపై తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ప్రేమజంటల వీడియోలు గోప్యంగా చిత్రీకరించి, వాటిని చూపిస్తూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.అంతేకాకుండా, వీడియోలను ఆధారంగా తీసుకుని మహిళలను వేధిస్తూ, అనుచిత కోరికలు కోరుతున్నాడనే ఆరోపణలు కూడా బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, విచారణ అనంతరం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఏఎస్సై శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పోలీసులు ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 23వ వార్డులో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరై, కమిటీ సభ్యులతో పదవీ బాధ్యతల ప్రమాణం చేయించారు.అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో భాగంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…“దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడం, ఆలయ పరిపాలనను పారదర్శకంగా నిర్వహించడం నూతన కమిటీ ప్రధాన బాధ్యత. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలి.శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. సేవా భావంతో పని చేస్తే ఆలయ అభివృద్ధి మాత్రమే కాకుండా సమాజానికి కూడా…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్‌లో సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొని, పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…“మహాత్మ జ్యోతిరావు పూలే గారు సమాజంలో అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు. ఆయన విద్యా విప్లవానికి నాంది పలికి, మహిళల విద్యకు, సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడిగా నిలిచారు. కుల వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజంలో మార్పు తీసుకువచ్చిన గొప్ప సంస్కర్త. ప్రతి ఒక్కరూ పూలే గారి ఆశయాలను ఆచరణలో పెట్టుకోవాలి. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం ఆయన చూపిన మార్గం. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. పూలే గారి ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో…

Read More

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసిన మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ పఠాన్ నాగూర్ వలి తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పిన్నంశెట్టి మహాలక్ష్మి 532 మార్కులతో ప్రథమ స్థానాన్ని, 519 మార్కులతో షేక్ అమీషా ద్వితీయ స్థానాన్ని సాధించారు. బీకాం కంప్యూటర్ విభాగంలో షేక్ బషీర్ ప్రథమ స్థానం, ఉమ్మిడి భూమిక ద్వితీయ స్థానం పొందారు. బీఎస్సీ బి.జెడ్.సి విభాగంలో వీరంకి భువనేశ్వర్, బీఏ విభాగంలో నాగిరెడ్డి లక్ష్మీప్రసన్నలు ప్రథమ స్థానాల్లో నిలిచారు.కళాశాల చైర్మన్ మారేపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు మంచి మార్కులతో పాటు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మర్రి వెంకటనారాయణ, షేక్ మస్తాన్ వలి, ఆంజనేయ శాస్త్రి, అధ్యాపకులు సునీల్ కుమార్, సయ్యద్…

Read More