
నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాల్లో పలనాడు ప్రాంతానికి చెందిన ఈ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పట్టణ స్థాయిలో అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. అన్ని గ్రూపుల్లోనూ మొదటి, రెండవ, తృతీయ స్థానాలను సాధించడం ద్వారా కళాశాల ప్రతిష్టను మరింత పెంచారని కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ పఠాన్ నాగూర్ వలి తెలిపారు.
సీనియర్ ఇంటర్ MPC విభాగంలో తిర్లికా విశ్వ చైతన్య 984 మార్కులతో పట్టణ టాపర్‌గా నిలవగా, అట్లూరి శ్రీలక్ష్మి 983 మార్కులతో రెండవ స్థానం, రాచమడుగు లక్ష్మీ సుహశ్రీ 981 మార్కులతో మూడవ స్థానం సాధించారు. మొత్తం 45 మంది విద్యార్థులు 900కి పైగా మార్కులు సాధించగా, 36 మంది విద్యార్థులు గ్రూప్ సబ్జెక్టుల్లో 100% మార్కులు పొందడం విశేషం.

జూనియర్ MPC విభాగంలో తెలపాటి మధు గణేష్ 463 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, షేక్ రోషిని 462 మార్కులతో రెండవ స్థానం, పిట్టల నాని 461 మార్కులతో మూడవ స్థానం సాధించారు. భీమనబోయిన వైష్ణవ్ (460), శ్రీహిత (459) తదితరులు కూడా అగ్రస్థానాల్లో నిలిచారు. మొత్తం 52 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించగా, 34 మంది విద్యార్థులు గ్రూప్ సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు సాధించారు.
సీనియర్ BPC విభాగంలో షేక్ షమీనా బేగం 969 మార్కులతో పట్టణ టాపర్‌గా నిలవగా, చవిటి హృదయరాజు 935 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. జూనియర్ BPC విభాగంలో భీమవరపు సునీత 429 మార్కులతో మొదటి స్థానం, మేకల చరిత 423 మార్కులతో రెండవ స్థానం, ప్రత్యూష 416 మార్కులతో అగ్రస్థానాలు సాధించారు. నలుగురు విద్యార్థులు గ్రూప్ సబ్జెక్టుల్లో 100% మార్కులు సాధించడం గర్వకారణంగా నిలిచింది.
సీనియర్ CEC విభాగంలో సాయి రమ్య 913 మార్కులతో పట్టణ టాపర్‌గా నిలవగా, జూనియర్ CECలో షేక్ ఆదిష్య 445 మార్కులతో అగ్రస్థానం సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మారేపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఉన్నతమైన మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వరుసగా రెండేళ్లుగా MPC, BPC విభాగాల్లో అగ్రస్థానాలు సాధించడం గర్వకారణమని ప్రిన్సిపాల్స్ నూతలపాటి శివభాస్కర్, వెంకట నారాయణ తెలిపారు.
విద్యార్థుల విజయంపై కళాశాల డైరెక్టర్లు ఆంజనేయ శాస్త్రి, షేక్ మస్తాన్ వలి, అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. నిర్వహించిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కళాశాల కృషిని కొనియాడారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను రోటరీ డిస్ట్రిక్ట్ 3150 డిసీజెస్ అండ్ ప్రివెన్షన్ చైర్మన్ డాక్టర్ కొండవీటి రామకోటయ్య అభినందించి మిఠాయిలు పంపిణీ చేశారు.
