
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 23వ వార్డులో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరై, కమిటీ సభ్యులతో పదవీ బాధ్యతల ప్రమాణం చేయించారు.
అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో భాగంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
“దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడం, ఆలయ పరిపాలనను పారదర్శకంగా నిర్వహించడం నూతన కమిటీ ప్రధాన బాధ్యత. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలి.
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. సేవా భావంతో పని చేస్తే ఆలయ అభివృద్ధి మాత్రమే కాకుండా సమాజానికి కూడా మంచి జరుగుతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

