
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసిన మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ పఠాన్ నాగూర్ వలి తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పిన్నంశెట్టి మహాలక్ష్మి 532 మార్కులతో ప్రథమ స్థానాన్ని, 519 మార్కులతో షేక్ అమీషా ద్వితీయ స్థానాన్ని సాధించారు. బీకాం కంప్యూటర్ విభాగంలో షేక్ బషీర్ ప్రథమ స్థానం, ఉమ్మిడి భూమిక ద్వితీయ స్థానం పొందారు. బీఎస్సీ బి.జెడ్.సి విభాగంలో వీరంకి భువనేశ్వర్, బీఏ విభాగంలో నాగిరెడ్డి లక్ష్మీప్రసన్నలు ప్రథమ స్థానాల్లో నిలిచారు.
కళాశాల చైర్మన్ మారేపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు మంచి మార్కులతో పాటు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మర్రి వెంకటనారాయణ, షేక్ మస్తాన్ వలి, ఆంజనేయ శాస్త్రి, అధ్యాపకులు సునీల్ కుమార్, సయ్యద్ రబ్బాని పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు, పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు.
