
గన్నవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా
స్వామివారికి నూతన పల్లకి బహుకరణ
మాచర్ల మండలం గన్నవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కిన పున్నయ్య కుమారులు స్వామివారికి నూతన పల్లకిని భక్తి భావంతో బహుకరించారు.
అనంతరం దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తి పారవశ్యం కనిపించింది.

