
మాచర్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈరోజు ఉపాధిహామీ సిబ్బందితో ఎంపిడిఓ శ్రీ ఆర్. ఫణి కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో 01.04.2026 నుండి ఉపాధిహామీ (వీబీ జి రామ్ జి) పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
రేపటి నుండి అన్ని గ్రామాలలో పండగ వాతావరణంలో పనులను ప్రారంభించి, శ్రామికులు పెద్దఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశాల్లో శ్రామికులకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు.
శ్రామికుల హాజరు ఫేస్ ఆథెంటికేషన్ (ఆధార్ ఆధారిత) విధానంలో నమోదు చేయబడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీఓ నాగ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో మేట్లను నియమించాలని, శ్రామికులు అందరూ విధిగా పనులకు హాజరుకావాలని కోరారు.
