
మాచర్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలను సన్మానించారు. మండలంలో మొత్తం 200 కుటుంబాలు 100 రోజుల పనిని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కంభంపాడు గ్రామానికి చెందిన ఎల్లాపి వెంకటేశ్వర్లు గారిని ఎంపిడిఓ ఫణి కుమార్ శాలువాతో ఘనంగా సన్మానించారు.
అదేవిధంగా మండలంలోని అన్ని శ్రామికులు 100 రోజుల పనిని పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వీబీ జి రామ్ జి పథకం కింద 125 రోజుల వరకు పనిని వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ వెంకయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
